రివర్స్: భార్యపై గృహ హింస కేసు పెట్టి, మనోవర్తి కోరాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో రివర్స్ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై గృహ హింస కేసు పెట్టాడు.తన భార్య వేధిస్తోందని ఆరోపిస్తూ, తనకు మనోవర్తి ఇప్పించాలని కేసు వేశాడు. ఈ మేరకు శనివారం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

బలిజిపేటకు చెందిన బొమ్మాళి ప్రసాద్‌రావుకు నెల్లిమర్లకు చెందిన ఎర్రంశెట్టి రాజేశ్వరితో 2006 ఏప్రిల్‌ 23వ తేదిన పెళ్లయింది. 2008లో వీరికి కూతురు పుట్టింది. ప్రసాద్‌ రావు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

Man files domestic violence case against wife

భార్య రాజేశ్వరి నెల్లిమర్లలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పెళ్లయిన తర్వాత విజయనగరం పట్టణంలోని తోటపాలెంలో కాపురం పెట్టారు 2008 తర్వాత రాజేశ్వరి నెల్లిమర్లకు వెళ్లిపోయింది. ప్రస్తుతం భార్య భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.

రాజేశ్వరి పోలీస్‌శాఖలో పనిచేసే తన సోదరి ద్వారా తనను మానసిక హింసకు గురిచేస్తోందని ఆరోపిస్తూ తనకు రక్షణ కల్పించాలని ప్రసాద్‌రావు బొబ్బిలి కోర్టులో గత నెల 13వ తేదీన పిటిషన్‌ వేశారు. దానికితోు తనకు నెలకు రూ.20 వేలు మనోవర్తి కింద, ఇంటి అద్దెకు రూ.3 వేలు చొప్పన ఇప్పించాలని పిటిషన్‌లో కోరాడు.

దీంతో ఆ పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా కేంద్రంలో ఉన్న గృహ హింస విభాగానికి కోర్టు పంపించింది. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా చూడడాినికి ఈ కేసును రిజిస్ట్రర్‌ చేయాలా వద్దా సూచించాలని జిల్లా జడ్జికి లేఖ వారు లేఖ రాశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man in Vjayanagaram district has filed domestic voilence case on his wife.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి