Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పల్సర్ పుట్టిన రోజు. భారీ డిస్కౌంట్ పాటు ఫ్రీ సర్వీసింగ్!

భారతదేశంలో స్పోర్ట్స్ బైక్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చే పేరు బజాజ్ పల్సర్. ఒకప్పుడు మైలేజ్ బైక్‌లే ఎక్కువగా కనిపించిన ఇండియన్ మార్కెట్‌లో, పవర్ + స్టైల్ + స్పోర్టీ లుక్‌ను సామాన్య యువతకు పరిచయం చేసిన బ్రాండ్ పల్సర్. అందుకే ఇది కేవలం బైక్ మాత్రమే కాదు... ఒక యూత్ ఐకాన్గ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే 25 వసంతంలోకి అడుగుపెట్టింది. పల్సర్ పుట్టిన రోజు సందర్భంగా అద్బుతమైన ఆఫర్ అందిస్తుంది బజాజ్.

డిజైన్ మ్యాటర్‌లో అయినా, ఇంజిన్ పెర్ఫార్మెన్స్‌లో అయినా, ఫీచర్ల విషయంలో అయినా... టైమ్ మారినప్పుడల్లా పల్సర్ కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, అగ్రెసివ్ స్టైలింగ్, స్ట్రాంగ్ ఇంజిన్ ట్యూనింగ్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. అందుకే 25 ఏళ్లుగా ఇండియన్ రోడ్లపై పల్సర్ హవా తగ్గలేదు.ఇప్పుడు ఈ లెజెండరీ బ్రాండ్ తన 25 ఏళ్ల జర్నీని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. దీనిలో భాగంగా బజాజ్ ఆటో '25 ఇయర్స్ ఆఫ్ పల్సర్ సెలబ్రేషన్ ఆఫర్' ను ప్రకటించింది.

అన్ని బజాజ్ షోరూమ్‌లలో..

ఆఫర్‌లో భాగంగా పల్సర్ బైక్ పై రూ.7,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కేవలం డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కాదు... పల్సర్‌ను ఇష్టపడిన కోట్లాది యూజర్లకు ఇచ్చే థ్యాంక్యూ గిఫ్ట్‌లా చెప్పొచ్చు. ఈ స్పెషల్ ఆఫర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక బజాజ్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. పల్సర్ కొనాలనుకుంటున్నవాళ్లకు ఇది బెస్ట్ టైమ్‌గా మారింది. 25 ఏళ్లుగా యూత్ హార్ట్‌బీట్‌గా ఉన్న పల్సర్, ఈ సెలబ్రేషన్ ఆఫర్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

25 Years of Pulsar Milestone Celebration amp amp Special Customer Benefits

పల్సర్ లైనప్‌లో బడ్జెట్ బైక్‌ల నుంచి పవర్ ప్యాక్ మోడళ్ల వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కావాలంటే 125cc మోడల్ ఉంది. ఎక్కువ పవర్, లేటెస్ట్ ఫీచర్లు కావాలంటే పెద్ద ఇంజిన్ మోడళ్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పల్సర్ రేంజ్ 125cc నుంచి 400cc వరకు విస్తరించి ఉంది. మొత్తం 11 డిఫరెంట్ మోడళ్లు ఉండటంతో, ప్రతి రైడర్‌కి సరిపోయే పల్సర్ ఒకటి తప్పకుండా దొరుకుతుంది. పల్సర్ 125 ఈ రేంజ్‌లో స్టార్టింగ్ మోడల్. స్పోర్టీ లుక్‌తో పాటు సరసమైన ధరలో పల్సర్ ఫీల్ ఇవ్వడం దీని ప్లస్ పాయింట్. ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే యువతకు ఇది మంచి ఛాయిస్. దీని తర్వాత పల్సర్ N150, పల్సర్ 150, పల్సర్ N160 వంటి పాపులర్ మోడళ్లు యూత్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+