Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆటోమొబైల్ ఆస్కార్స్: 2026 కార్, బైక్ ఆఫ్ ది ఇయర్ ఇవే!

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్'(ICOTY), 'ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్'(IMOTY) 2026 విజేతలను ప్రకటించారు. ఈ ఏడాది మార్కెట్లో సంచలనం సృష్టించిన మారుతి సుజుకి విక్టోరిస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 310 అగ్రస్థానంలో నిలిచాయి. జేకే టైర్ ఆధ్వర్యం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ కేటగిరీల్లో విజేతలుగా ఈ వాహనాలు నిలిచాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్: మారుతి సుజుకి విక్టోరిస్
ఈ రేసులో మారుతి విక్టోరిస్ గట్టి పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచింది. స్కోడా కైలాక్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. మహింద్రా ఎక్స్ఈవీ 9ఈ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి దిగ్గజ కార్లు కూడా ఈ రేసులో ఉండటం గమనార్హం.

Auto Oscars 2026 ICOTY and IMOTY Winners Maruti Victoris TVS Apache RTX 310 Lead

2. ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 310
టూ వీలర్ విభాగంలో టీవీఎస్ అపాచీ తన సత్తా చాటింది. కేటీఎం 390 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650, యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 వంటి శక్తివంతమైన బైకులను వెనక్కి నెట్టి అపాచీ ఆర్‌టీఎక్స్ 310 ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది.

3. గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్: మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ
పర్యావరణ హితమైన వాహనాల విభాగంలో మహింద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎక్స్ఈవీ 9ఈ' అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టెస్లా మోడల్ వై, బీవైడీ సీలయన్ 7, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి కార్లతో ఇది పోటీ పడింది.

4. ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్: ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
లగ్జరీ, పర్ఫార్మెన్స్ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ అవార్డును గెలుచుకుంది. బీఎమ్‌డబ్ల్యూ iX1, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, టయోటా కామ్రీ వంటి కార్లు ఈ కేటగిరీలో నామినేట్ అయ్యాయి.

విజేతల జాబితా సంక్షిప్తంగా..
*ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) -మారుతి సుజుకి విక్టోరిస్
*ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY)- టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 310
*ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్-ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
*గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ (EV)-మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+