Gold రేట్లు ఎందుకు తగ్గుతున్నాయ్! యుద్ధం తెచ్చిన బంపర్ ఆఫర్!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ పసిడి మార్కెట్‌ను ఒక వింతైన పరిస్థితిలోకి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పసిడి వర్తకానికి ప్రధాన కేంద్రమైన దుబాయ్‌లో మాత్రం ధరలు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గగనతలం పాక్షికంగా మూసివేయబడటం, విమాన సర్వీసులు రద్దు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఎగుమతులు నిలిచిపోవడంతో పేరుకుపోయిన నిల్వలను వదిలించుకోవడానికి వ్యాపారులు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్స్‌కు 30 డాలర్ల వరకు తగ్గింపు ఇస్తున్నారు.
సాధారణంగా దుబాయ్ నుంచి బంగారం రవాణా ఎక్కువగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో జరుగుతుంది. అయితే యుద్ధ భయాల రీత్యా విమాన సర్వీసులు పరిమితం కావడంతో లాజిస్టిక్స్ వ్యవస్థ కుదేలైంది. సరుకును రోడ్డు మార్గంలో సౌదీ అరేబియా లేదా ఒమన్‌కు తరలించే అవకాశం ఉన్నప్పటికీ, సరిహద్దుల వద్ద ఉండే భద్రతాపరమైన ముప్పులు.. బీమా సమస్యల కారణంగా వ్యాపారులు ఆ సాహసం చేయడం లేదు. దీనివల్ల కొనుగోలుదారులు అధిక షిప్పింగ్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులను భరించలేక కొత్త ఆర్డర్‌లను నిలిపివేశారు. ఫలితంగా సరఫరా గొలుసులో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.

దేశంలో Gold స్వల్పకాలిక కొరత..
భారతదేశంపై ఈ ప్రభావం ప్రస్తుతానికి మిశ్రమంగా ఉంది. దుబాయ్ నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్‌లో భౌతిక బంగారం లభ్యతలో స్వల్పకాలిక కొరత కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, జనవరి నెలలో మన దేశం భారీ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకోవడం, ప్రస్తుతం ధరలు ఔన్స్‌కు 5,000 డాలర్ల మార్కును దాటడంతో డిమాండ్ తక్కువగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం. అంటే, మన వద్ద ఉన్న నిల్వలు ప్రస్తుత అవసరాలకు సరిపోతాయి. కానీ, ఈ యుద్ధం గనుక దీర్ఘకాలం కొనసాగితే మాత్రం సరఫరా లేక దేశీయంగా ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.
సాధారణ స్థితికి వస్తేనే..
మరోవైపు, పసిడి శుద్ధి కర్మాగారాలు (Refineries) కూడా ముడి బంగారాన్ని (Dore) సేకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మధ్యప్రాచ్యంలోని గనుల నుంచి వచ్చే సరుకు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకాల్సి వస్తోంది. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు ఏకంగా 60% నుండి 70% వరకు పెరిగాయి. డాలర్ విలువలో ఒడిదొడుకులు, యుద్ధం వల్ల తలెత్తిన అనిశ్చితి వెరసి.. బంగారం మార్కెట్ ఇప్పుడు ఒక అస్థిరమైన దశలో ఉంది. యుద్ధం ముగిసి విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి వస్తేనే దుబాయ్ నుంచి పసిడి ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications