Starlink-Airtel:జియోకు చెక్..మస్క్‌తో జతకట్టిన ఎయిర్‌టెల్..గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్

భారతదేశ టెలికాం రంగంలో సంచలనం! దేశంలో ఇంటర్నెట్ వినియోగం సరికొత్త శిఖరాలకు చేరనుంది. ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, స్టార్‌లింక్‌కు చెందిన అత్యాధునిక హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఇకపై భారతదేశంలోని ప్రతి మూలకు చేరనున్నాయి. మారుమూల గ్రామాలు సైతం హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో వెలుగులు నిండనున్నాయి.

భారత్‌లో స్టార్ లింక్ తొలి ఒప్పందం
భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించడానికి ఇది మొట్టమొదటి అధికారిక ఒప్పందం కావటం విశేషం. అయితే, స్పేస్‌ఎక్స్ సంస్థ భారత ప్రభుత్వం నుండి అనుమతులు పొందాల్సి ఉంది. ఈ ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కేవలం ఇంటర్నెట్ సేవలు అందించడానికి మాత్రమే పరిమితం కాదు. ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్లలో అత్యాధునిక స్టార్‌లింక్ పరికరాలు లభ్యం కానున్నాయి. వ్యాపార సంస్థలకు ప్రత్యేకంగా ఎయిర్‌టెల్ ద్వారా స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు, విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు సమాజ వికాసం కోసం మరెన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నారు.

elon-musks-starlink-set-to-launch-in-india-with-airtel-as-key-partner

ఎయిర్‌టెల్- స్టార్‌లింక్ జోడీ
భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "స్పేస్‌ఎక్స్‌తో చేతులు కలపడం ఒక గొప్ప ముందడుగు. నెక్స్ట్-జెనరేషన్ శాటిలైట్ టెక్నాలజీకి మేం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ ఒప్పందం తెలియజేస్తుంది అని అన్నారు. స్టార్‌లింక్ అనేది ఒక విప్లవాత్మక శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. స్ట్రీమింగ్ అయినా, వీడియో కాల్స్ అయినా, ఆన్‌లైన్ గేమింగ్ అయినా, రిమోట్ వర్క్ అయినా.. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్నీ సాఫీగా జరిగిపోతాయి

ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రపంచ స్థాయి ఇంటర్నెట్ సేవలు అందుతాయని విటల్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి, వ్యాపారానికి, సమాజానికి నమ్మకమైన ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుందన్నారు. ఎయిర్‌టెల్ అందిస్తున్న సేవలకు స్టార్‌లింక్ మరింత బలాన్నిస్తుందని చెప్పిన ఎయిర్‌టెల్ ఎండీ...తమ కస్టమర్లు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. వారికి సరసమైన ధరలో, నమ్మకమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయని భరోసా ఇచ్చారు.

Take a Poll

స్పేస్‌ఎక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్వైన్ షాట్‌వెల్ ఈ సందర్భంగా మాట్లాడారు.భారతదేశ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ ఒక వెలుగు వెలిగిందన్నారు . వారితో కలిసి పనిచేయడం తమకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. భారతదేశ ప్రజల జీవితాల్లో స్టార్‌లింక్ ఒక గొప్ప మార్పును తీసుకురాగలదని తాము నమ్ముతున్నట్లు చెప్పిన గ్వైన్ షాట్ వెల్.. స్టార్‌లింక్ ద్వారా కనెక్ట్ అయిన ప్రజలు, వ్యాపారాలు, సంస్థలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని చూసి తాము ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు వెల్లడించారు.

రిలయన్స్ జియో ఆదిపత్యానికి చెక్
ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో రిలయన్స్ జియో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో, ఎయిర్‌టెల్-స్టార్‌లింక్ భాగస్వామ్యం జియోకు గట్టి పోటీనిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే స్పెక్ట్రమ్ వేలంలో భారీగా పెట్టుబడులు పెట్టిన టెలికాం సంస్థలు, స్టార్‌లింక్ రాకతో వినియోగదారులను కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా, ఎయిర్‌టెల్-స్పేస్‌ఎక్స్ కలయిక మాత్రం భారత ఇంటర్నెట్ రంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికినట్లయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+