• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాప్ సంస్థలు ఫేస్‌బుక్‌కు బైబై: జుకర్‌బర్గ్‌కు 10.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు హుష్ కాకి!

By Swetha Basvababu
|

న్యూయార్క్‌: కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యిందని కొన్ని రోజులుగా ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతితెలిసిందే. దీంతో ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న యూజర్లు ఫేస్‌‌బుక్‌ ఖాతాలను తొలగించాలని సోషల్‌మీడియాలో పిలుపునిస్తున్నారు.

హ్యాష్‌ట్యాగ్‌తో #deletefacebook ఉద్యమం ప్రారంభించారు. తమవైపు నుంచి పొరబాటు జరిగిందని సంస్థ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినా ఈ ఉద్యమం ఆగట్లేదు.

 టెస్లా, స్పేస్ఎక్స్ ఖాతాలు తొలిగించిన అధినేత ఎలన్ మస్క్

టెస్లా, స్పేస్ఎక్స్ ఖాతాలు తొలిగించిన అధినేత ఎలన్ మస్క్

తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను వీడుతున్నాయి. ఫేస్‌బుక్‌లో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల ఖాతాలను తొలగించినట్లు ఆ సంస్థల అధినేత ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తగానే స్పేస్‌ఎక్స్‌, టెస్లా ఖాతాలను తొలగించాలని ట్విటర్‌లో ఎలన్‌మస్క్‌ను ఆయన ఫాలోవర్లు కోరారు. దీంతో ఖాతాలను తీసేస్తున్నట్లు ఎలన్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌ డేటాను ఇకపై మరింత భద్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని జుకర్‌బర్గ్‌ చెప్పారు.

ప్రైవసీ సెట్టింగ్స్ మెరుగుపర్చాక మళ్లీ పోస్టులు ప్రారంభిస్తామని వెల్లడి

ప్రైవసీ సెట్టింగ్స్ మెరుగుపర్చాక మళ్లీ పోస్టులు ప్రారంభిస్తామని వెల్లడి

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ కూడా తాము ఫేస్‌బుక్‌ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు తెలిపింది. మొజిల్లా తన ఖాతాను తొలగించకున్నా.. ఇకపై ఈ ఖాతా నుంచి ఏ పోస్టులు చేయబోమని తెలిపింది. ‘ఫేస్‌బుక్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ ఖాతాలో ఎలాంటి పోస్టులు పెట్టబోం' అని తెలిపింది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను మెరుగుపరిచాక మళ్లీ ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తాం' అని మొజిల్లా చెప్పుకొచ్చింది.

యూజర్ల పరిరక్షణకు ఫేస్ బుక్ యాజమాన్యం చర్యలు ఇలా

యూజర్ల పరిరక్షణకు ఫేస్ బుక్ యాజమాన్యం చర్యలు ఇలా

వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్‌ ఆక్టన్‌ కూడా ‘ఇది ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం' అని ట్వీట్‌ చేశారు. దీంతో ఈ డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారుతోంది. మరోవైపు యూజర్లను కోల్పోకుండా ఉండేందుకు అటు ఫేస్‌బుక్‌ యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన కన్సల్టెన్సీ సంస్థ ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా'కు ఐదుకోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం చిక్కిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ యాప్‌ ద్వారా ఈ సమాచారాన్ని ఆ సంస్థ సేకరించినట్లు తెలిసింది. దీంతో ఫేస్‌బుక్‌కు చిక్కులు ఎదురయ్యాయి.

 అగ్రశ్రేణి కుబేరుల ఆస్తి రూ.28లక్షల కోట్లు ఆవిరి

అగ్రశ్రేణి కుబేరుల ఆస్తి రూ.28లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచ కుబేరులకు 2018 అంతగా కలిసొచ్చినట్లు లేదు. వరుస పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదేలవడంతో సంపన్నుల రూ. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఇప్పటివరకు అగ్రశ్రేణి 500 ప్రపంచ కుబేరులు 436 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 28.33 లక్షల కోట్లకు పైమాటేనన్న మాట. ఈ వారంలోనే ఆ 500 మంది 181 బిలియన్‌ డాలర్ల నష్టాలను చవిచూశారు.

 ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7 బిలియన్ల డాలర్లు నష్టం

ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7 బిలియన్ల డాలర్లు నష్టం

ఇందులో ఎక్కువగా సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ నష్టపోయారు. జనవరి 26 నుంచి జుకర్‌బర్గ్‌ 10.3 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ సూచీలో జుకర్‌బర్గ్‌ నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి పడి పోయారు. ఒరాకిల్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్‌ ఏడు బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫేట్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో ల్యారీ పేజ్‌ సంయుక్తంగా 17 బిలియన్‌ డాలర్లు కోల్పోయారు.

 ఫేస్‌బుక్ షేర్లు 14 శాతం మేరకు పతనం

ఫేస్‌బుక్ షేర్లు 14 శాతం మేరకు పతనం

ఇదిలా ఉంటే బ్లూమ్‌బర్గ్‌ సూచీ ప్రకారం 500 ప్రపంచ కుబేరుల మొత్తం సంపద 5.2 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మొదటి నుంచి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో క్రెడిట్‌ రేటింగ్‌ పెంచడంతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగం ఆరోపణల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ షేర్లు 14శాతం మేర నష్టపోయాయి.

 ఎక్కువ టేకోవర్లు జరిగినా విలువ తక్కువే

ఎక్కువ టేకోవర్లు జరిగినా విలువ తక్కువే

గతేడాది (2017) దేశంలో విలీనాలు, టేకోవర్‌ల సంఖ్య పెరిగినా.. విలువ ప్రకారం చూస్తే మాత్రం తగ్గాయని ఎర్నెస్ట్‌యంగ్‌ (ఈవై) తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది మొత్తం 4,680 కోట్ల డాలర్ల విలీనాలు, టేకోవర్‌లు జరిగాయి.. 2016తో పోల్చుకుంటే విలువ ప్రకారం 12 శాతం తగ్గాయి. ఈ ఏడాది పరిస్థితి కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈవై చెబుతోంది. దీనికి ప్రధాన కారణం సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని వివరణ ఇచ్చింది. 2017లో విలీనాలు, టేకోవర్‌లు (ఎంఅండ్‌ఏ)లు ఏడేళ్ల గరిష్ఠానికి మొత్తం 1,022 జరిగాయి. వాటిలో ఎక్కువగా టెలికం, రిటైల్‌, కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టెక్నాలజీ రంగాల షేర్లు ఎక్కువగా ఉన్నాయి. విలువ ప్రాతిపదికన చూస్తే మాత్రం బాగా తగ్గాయి. తక్కువ స్థాయి ఎం అండ్‌ ఏలు 20 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఒప్పందాలు జరిగాయని ఈవై భాగస్వామి అమిత్‌ ఖండేల్‌వాల్‌ చెప్పారు.

2016లో 21.. గతేడాది 13 టేకోవర్లు మాత్రమే నమోదు

2016లో 21.. గతేడాది 13 టేకోవర్లు మాత్రమే నమోదు

2017‌లో కార్పొరేట్లు పెద్ద టేకోవర్ల జోలికి పోలేదు. దీంతో సుమారు 500 మిలియన్‌ డాలర్ల ఒప్పందాలు 2016లో 21 జరిగితే గతేడాది 13 మాత్రమే పరిమితం అయ్యాయి. దీనికి ప్రధాన కారణం నియంత్రణా సంస్థల నిబంధనలు కూడా పెద్దడీల్స్‌పై ప్రభావం చూపాయని యర్నెస్ట్ యంగ్ (ఈవై) సహ వ్యవస్థాపకుడు ఖండేవాల్‌ వివరించారు. దేశంలో జరిగిన డీల్స్‌లో 71 శాతం వరకు తగ్గాయి. 340 లావాదేవీల ద్వారా 800 -900 కోట్ల డాలర్లు జరిగితే, విదేశీడీల్స్‌ మాత్రం ఏడు శాతం వరకు తగ్గాయి. ఈ లావాదేవాల్లో అమెరికా, సింగపూర్‌, జపాన్‌లవే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది 2018 విషయానికి వస్తే దేశీయంగా పెద్దమొత్తంలో విలీనాలు టేకోవర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని నివేదికలో వివరించింది.

English summary
Facebook is facing a backlash from its users and investors, after the company failed to disclose that millions of profiles were used by a third party during the presidential campaign without their consent.Co-founder and CEO Mark Zuckerberg broke his silence this Wednesday, followed by COO Sheryl Sandberg in an interview with CNBC on Thursday. Both executives apologized and said they were open to tighter regulation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X