బంపర్ ఆఫర్: ఐఫోన్ 13పై 30,600 డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సేల్ ప్రారంభించబోతోంది. ఈ భారీ పండగ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమై 15న తేదీన ముగియనుంది. కంపెనీ ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఆఫర్లను వెల్లడించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లైయెన్సెస్‌పై భారీ రాయితీని ఇవ్వనుంది. ఐఫోన్ 13పై (iPhone 13) కళ్లు చెదిరే రాయితీ ఇవ్వబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,499గా ఉంది.

అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం అదనపు రాయితీ.. పాత బ్రాండెడ్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.30,600 రాయితీ ఇస్తారు. వీటిని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 13 కేవలం రూ.20వేలకు లభిస్తుంది. 2021 సెప్టెంబర్ 14న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 13ను యాపిల్ విడుదల చేసింది. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, సినిమాటిక్ మోడ్, సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 12MP డ్యుయల్ కెమెరా సిస్టమ్, A15 బయోనిక్ చిప్, 3240mAh బ్యాటరీ ఇస్తోంది. పనితీరుతోపాటు డిస్ ప్లే, కెమెరా.. ఇలా అన్ని విభాగాల్లో ఇది మొబైల్ బెస్ట్ గా నిలిచింది.

flipkart

బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లేదంటే కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, కొనుగోలుపై 10% రాయితీని పొందొచ్చు. ఈ ఆఫర్‌ని వాడుకుంటే రూ.1500 రాయితీ ఉంటుంది. పేటీఎం యూజర్లకు వాలెట్, UPI లావాదేవీలపై కూడా రాయితీ లభిస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G, రియల్‌మీ 11x 5G, వివో V29e, మోటో G84 5G, మోటో G54 5G, రియల్‌మీ C51, పోకో M6 ప్రో 5G వంటి ఫోన్లపై భారీగా రాయితీలివ్వబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+