నేటి పెట్రోల్, డీజిల్ ధరల్లో..
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న సంఘర్షణ కారణంగా ఇటీవల ప్రపంచ ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ సంక్షోభం హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదంపై ఆందోళనలను రేకెత్తించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ కీలక మార్గం గుండానే సాగుతుంది. దీని ప్రభావంతో ఈ వార ప్రారంభంలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది.
తీవ్ర ప్రతికూల పరిణామాల్లోనూ దేశంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే ఉంటోన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలేవీ కూడా ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయట్లేదు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రిటైల్ ధరలు తగ్గట్లేదు.

రిటైల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థలకు భిన్నంగా ప్రైవేట్ రిటైలర్ నయర ఎనర్జీ తన అధిక ఉత్పత్తి వ్యయాలను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు అయిదు, డీజిల్‌పై మూడు రూపాయల మేర ధరలను పెంచింది. ప్రీమియం పెట్రోల్ వేరియంట్ల ధరలు లీటరుకు దాదాపు రెండు రూపాయల వరకు పెరిగాయి.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications