పండగల వేళ.. బంగారం ధరల్లో పురోగమనం
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ బులియన్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ రిటైల్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పుంజుకొన్నాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు మొగ్గు చూపుతుండటంతో ధరలకు బలం చేకూరింది. ఈ సానుకూల పరిణామాలు ఇక ముందూ కొనసాగుతాయనే అభిప్రాయాలు లేకపోలేదు.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా పసిడి, వెండి కాంట్రాక్టులు లాభాల్లో నడిచాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.11 శాతం మేర పెరిగి 10 గ్రాములకు రూ.1,47,970 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ 0.51 శాతం లాభంతో కిలోకు రూ. 2,12,370 వద్ద కొనసాగింది. అంతర్జాతీయంగా అమెరికా సైనిక వ్యూహాలు, ఇరాన్ ప్రతిఘటన హెచ్చరికలు గ్లోబల్ మార్కెట్లలో భయాందోళనలను పెంచాయి. ఇలాంటి సమయంలో సురక్షితమైన ఆస్తిగా భావించే పసిడికి డిమాండ్ పెరగడం సర్వసాధారణం. దీనికి తోడు పండగల సీజన్ కావడం వల్ల కొనుగోళ్లు కూడా పెరిగి రిటైల్ మార్కెట్లో ధరలు స్వల్పంగా పురోగమించాయి.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,590 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,291 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,650 వద్ద నిలిచింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,710 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,401 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,820 వద్ద నిలిచింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,830 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,511 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,990 వద్ద నిలిచింది. చెన్నైలో ఇవే రేట్లు రూ. 1,48,020, రూ. 1,35,685, రూ. 2,12,270 గా నమోదయ్యాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,115
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,058
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,058
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,058
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,058
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,744, 22 క్యారెట్లు - రూ. 13,515, 18 క్యారెట్లు - రూ. 11,058












Click it and Unblock the Notifications
