బంగారం కొనుగోలుదారులకు షాకిచ్చిన రేట్లు- అమాంతం
కృష్ణ జన్మాష్టమి పర్వదినాన దేశవ్యాప్తంగా పసిడి కొనుగోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు ఊపొచ్చింది. పండుగ సెంటిమెంట్‌తో ఆభరణాల కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతోండటం, అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, వజ్రాభరణాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరలో 1,310 రూపాయల పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్లు రూ. 1,200, 18 క్యారెట్లు రూ. 980 మేర పెరిగాయి. పసిడి ధరలలో ఈ పెరుగుదలకు అంతర్జాతీయ ఆర్థిక రంగానికి సంబంధించిన పరిణామాలు తోడ్పడుతున్నాయి. అమెరికా ఆర్థిక మార్కెట్లలో బాండ్ల ధరలు తగ్గడం బంగారానికి లాభదాయకంగా మారింది. దీనితో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు సులభతరం చేసేలా సడలింపులు ఉంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,666, 22 క్యారెట్లు రూ. 1,43,360 18 క్యారెట్లు రూ. 1,17,490 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,666, 22 క్యారెట్లు రూ.1,43,360, 18 క్యారెట్లు రూ. 1,17,490 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,666, రూ. 1,43,600, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,666, రూ. 1,43,850 రూ. 1,17,790 వద్ద కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,666, 22 క్యారెట్లు - రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 12,130
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,666, 22 క్యారెట్లు- రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,749
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,666, 22 క్యారెట్లు- రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,749
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,666, 22 క్యారెట్లు- రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,749
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,666, 22 క్యారెట్లు- రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,749
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,666, 22 క్యారెట్లు- రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,749

Click it and Unblock the Notifications