బంగారం-వెండి ధరలు ఆకాశానికి.. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న మార్కెట్
దేశీయ రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు పెట్టుబడిదారులకు ఊరట ఇవ్వడం లేదు. స్పాట్ మార్కెట్లలో తాత్కాలిక ప్రాఫిట్ బుక్కింగ్ కారణంగా స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, రిటైల్ స్థాయిలో మాత్రం పసిడి ధరలు నిరంతర పెరుగుదల దిశగానే పడుతున్నాయి.
గ్లోబల్ పరిణామాల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఉన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలను కొత్త స్థాయిలకు నెట్టేస్తున్నాయి. అదనంగా, పరిశ్రమల్లో బంగారం, వెండి డిమాండ్ కూడా బలపడడంతో ఈ విలువైన లోహాలకు పెట్టుబడిదారులు మరింతగా ఆకర్షితులు అవుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఫార్మా, ఆటో రంగాలపై కొత్త టారిఫ్స్ విధించడంతో పాటు విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు కూడా ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీని ఫలితంగా పెట్టుబడిదారులు విలువైన లోహాలను సురక్షిత హెడ్జింగ్ ఆస్తులుగా మార్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ మార్కెట్ల తాజా రేట్లు
గురువారం రోజు 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే గ్రాముకు రూ.22 పెరిగి రూ.12,415 వద్ద నమోదైంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,380గా కొనసాగుతోంది. ఈ రేట్లు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, నెల్లూరు, కడప నగరాల్లో ఒకేలా ఉన్నాయి.
వెండి ధరలూ అచంచలంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,71,000 వద్ద నిలిచింది. సరఫరా లోటు కారణంగా వెండి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు
24 క్యారెట్లు (గ్రాముకు):
చెన్నై - రూ.12,437
ముంబై - రూ.12,415
ఢిల్లీ - రూ.12,435
కోల్‌కతా - రూ.12,415
బెంగళూరు - రూ.12,415
కేరళ - రూ.12,415
22 క్యారెట్లు (గ్రాముకు):
చెన్నై - రూ.11,400
ముంబై - రూ.11,380
ఢిల్లీ - రూ.11,395
కోల్‌కతా - రూ.11,380
బెంగళూరు - రూ.11,380
కేరళ - రూ.11,380
నిపుణుల అంచనా మేరకు ప్రస్తుత గ్లోబల్ అస్థిరత కొనసాగితే బంగారం, వెండి ధరల్లో ఇంకా కొంతవరకు ఎగసే అవకాశం ఉంది. అయితే, స్పాట్ మార్కెట్లలో స్తబ్దత కనిపిస్తే స్వల్ప సరి దిద్దుకోలు కూడా జరగవచ్చని సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications