రోజు రోజుకూ పేలుతున్న బంగారం ధరలు..!!
బంగారం ధరల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అందనంత ఎత్తుకు చేరుకుంటోన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడం, డాలర్ పతనం, ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు వంటి అంశాలతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్ళారు. దీని ఫలితంగా, బంగారం, వెండి ధరలు నేడు ఎంసీఎక్స్ మార్కెట్‌లో రికార్డుస్థాయికి చేరాయి. గరిష్ఠ రేటును నమోదు చేశాయి.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,160, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,310 వద్ద నిలిచింది. మల్టీ-కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ రూ. 1,41,825 వద్ద రెడ్‌లో ట్రేడ్ అయ్యాయి. వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.25 శాతం పెరిగి రూ. 2,69,648కి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ఏడు శాతం పైగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించాయి. బంగారం దాదాపు రెండు శాతం ఎగబాకి ఔన్స్‌కు 4,600 డాలర్ కు చేరువ కాగా, వెండి 7.21 శాతం పెరిగి ఔన్స్‌కు 85 డాలర్ వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,30,800, 24 క్యారెట్ల బంగారం రూ. 1,42,680గా ఉన్నాయి. అహ్మదాబాద్, పుణేలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,30,700, 24 క్యారెట్ల బంగారం రూ. 1,42,580గా నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,30,650, 24 క్యారెట్ల బంగారం రూ. 1,42,530గా స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,368, 22 క్యారెట్లు - రూ. 13,170, 18 క్యారెట్లు - రూ. 10,980
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు- రూ. 10,690
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు- రూ. 10,690
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు- రూ. 10,690
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు- రూ. 10,690












Click it and Unblock the Notifications