మోత మోగిస్తోన్న బంగారం ధరలు.. !!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గేదేలేదంటోన్నాయి. నేడు మళ్లీ జంప్ అయ్యాయి. భౌగోళిక రాజకీయ సంక్షోభ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు మంగళవారం పెరుగుదల పట్టడానికి కారణం అయ్యాయి. ఎంసీఎక్స్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 0.24 శాతం వృద్ధిని నమోదు చేసింది. 10 గ్రాములకు 1,38,450కి చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ పరిస్థితీ ఇదే. 1.34 శాతం ఎగబాకి కిలోకు రూ. 2,49,444 వద్ద ట్రేడ్ అయ్యాయి.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ఉదయం సెషన్ లో భారీ ర్యాలీని కనపరిచాయి. వెండి దాదాపు 8.17 శాతం లాభపడి, ఔన్సుకు 78 డాలర్ల మార్కును అధిగమించింది. బంగారం మూడు శాతం వృద్ధితో ఔన్సుకు 4,465 డాలర్లకుపై ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,380కి చేరగా, 22 క్యారెట్లు రూ. 1,26,860 వద్ద లభ్యమైంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 2,48,100కి నమోదైంది.

ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,26,760, 24 క్యారెట్లు రూ. 1,38,380. అహ్మదాబాద్, పూణేలలో 22 క్యారెట్లు రూ. 1,26,860, 24 క్యారెట్లు రూ. 1,38,280గా నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్లు రూ. 1,26,860, 24 క్యారెట్లు రూ. 1,38,380కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,997, 22 క్యారెట్లు - రూ. 12,830, 18 క్యారెట్లు - రూ. 10,700
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,882, 22 క్యారెట్లు- రూ. 12,725, 18 క్యారెట్లు - రూ. 10,412
ఢిల్లీ..
24 క్యారెట్లు - రూ. 13,897, 22 క్యారెట్లు- రూ. 12,740, 18 క్యారెట్లు - రూ. 10,427
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,882, 22 క్యారెట్లు- రూ. 12,725, 18 క్యారెట్లు- రూ. 10,412
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,882, 22 క్యారెట్లు- రూ. 12,725, 18 క్యారెట్లు- రూ. 10,412
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,882, 22 క్యారెట్లు- రూ. 12,725, 18 క్యారెట్లు- రూ. 10,412
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,882, 22 క్యారెట్లు- రూ. 12,725, 18 క్యారెట్లు- రూ. 10,412












Click it and Unblock the Notifications