బంగారం ధరలు అనూహ్యంగా రివర్స్ గేర్

మొన్నటివరకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కనిష్ఠ స్థాయి నుంచి పుంజుకున్నాయి. ఈ అస్థిరత కారణంగా స్పష్టమైన ట్రెండ్‌ను గుర్తించడం కష్టం అవుతోంది. ఇది కొనుగోలుదారులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మరోసారి రూ. 1.50 లక్షల మార్కుకు చేరువవుతోంది. పసిడిలో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవడం కొనుగోలుదారులకు ఒక పెద్ద సవాలుగా మారింది.

అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,489.70 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో కంటే 2.59 శాతం పెరిగింది. యూఎస్ డాలర్ బలహీనత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పెరిగిన సేఫ్-హెవెన్ కొనుగోళ్లు బంగారం రికవరీకి దోహదపడ్డాయి. దేశ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 2,510 పెరిగి, కిందటి వారంలో గరిష్ట స్థాయిని అందుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,48,090 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,35,750 వద్ద స్థిరపడింది.

Gold Prices Rise Again as Uncover the Driving Forces Behind the Surge for Smart Buyers of Yellow Metal

గ్రాము బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల రూ. 14,809, 22 క్యారెట్లు రూ. 13,575, 18 క్యారెట్లు రూ. 11,107 పలికింది. రిటైలర్ల వద్ద తుది కొనుగోలు ధరలకు మూడుశాతం జీఎస్టీతో పాటు డిజైన్ ను బట్టి అయిదు నుండి 35 శాతం వరకు తయారీ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం ధరలు స్వల్పకాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ డాలర్ మరింత బలహీనపడితే, అంతర్జాతీయ బంగారం ధర ఔన్స్‌కు 4,600 డాలర్లను అధిగమిస్తుంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సేఫ్-హెవెన్ పెట్టుబడులకు మద్దతునిస్తున్నాయి. డ్రైవింగ్ ఫోర్స్ గా వ్యవహరిస్తోన్నాయి. మొన్నటివరకు కుప్పకూలుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకడానికి ప్రధాన కారణాలు ఇవే. ఈ సోమవారం నుండి దేశీయంగా వీటి రేట్లు మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,902, 22 క్యారెట్లు - రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,400

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+