బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !!

భారత్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అమెరికన్ డాలర్ బలపడటం, ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ చర్చల ప్రభావం పసిడిపై ఒత్తిడిని పెంచాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,50,000 కంటే దిగువకు ట్రేడ్ అవుతోంది. వెండిదీ దీనికి భిన్నమైన పరిస్థితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎంపీసీ సమావేశాలు కూడా ప్రారంభం కావడం పసిడి, వెండి ధరలపై ప్రభావాన్ని చూపింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,49,840గా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,37,350గా నమోదైంది. దేశవ్యాప్తంగా కిలో వెండి స్పాట్ ధర రూ. 2,30,000గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం రూ. 1,49,941 లకు తగ్గింది. వెండి మాత్రం 0.11 శాతం పెరిగి కిలోకు రూ. 2,33,634కు చేరింది. కామెక్స్ లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ రేట్లు తగ్గాయి. ఔన్స్‌ ఒక్కింటికి సుమారు 4,676 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 72 డాలర్ల వద్ద నిలిచింది.

Gold Prices Slump as Dollar Gains Push India s 24k Gold Near Rs 1 5 Lakh Per 10g Amid US Dollar Strength

నేడు దేశంలోని ప్రధాన నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ, జైపూర్‌లలో రూ. 1,49,840 నుండి రూ. 1,49,990 మధ్య పలికింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,37,350 నుండి రూ. 1,37,500 వరకు ఉంటోంది. ఈ నెలలో బంగారం ధరలు 14 శాతానికి పైగా పడిపోవడం అక్టోబర్ 2008 తర్వాత ఇదే అత్యంత భారీ నెలవారీ పతనం. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికన్ డాలర్ 2 శాతం కంటే ఎక్కువ బలోపేతం కావడమే దీనికి ప్రధాన కారణం.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,120, 22 క్యారెట్లు - రూ. 13,860, 18 క్యారెట్లు - రూ. 11,560

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,984, 22 క్యారెట్లు- రూ. 13,735, 18 క్యారెట్లు - రూ. 11,238

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,984, 22 క్యారెట్లు- రూ. 13,735, 18 క్యారెట్లు - రూ. 11,238

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,984, 22 క్యారెట్లు- రూ. 13,735, 18 క్యారెట్లు - రూ. 11,238

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,984, 22 క్యారెట్లు- రూ. 13,735, 18 క్యారెట్లు - రూ. 11,238

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,984, 22 క్యారెట్లు- రూ. 13,735, 18 క్యారెట్లు - రూ. 11,238

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+