పేలిన బంగారం ధరలు: ఇక పట్టలేం- అవే డ్రైవింగ్ ఫోర్స్
పసిడి ధరలు పరుగుు పెడుతున్నాయి. నేడు కూడా వీటి జోరు కొనసాగుతోంది. మార్కెట్లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా మూడో వారం కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం, యూఎస్ దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్స్ భారీగా తగ్గడం వంటి అంశాలు పసిడి విలువ పెరిగేలా చేశాయి.
స్టాక్, కరెన్సీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కావటంతో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన మార్గమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా పసిడి ఇండెక్స్ మరింత బలోపేతం కావడానికి కారణమైంది. పసిడి ధరలు భారీగా ఎగబాకడానికి ప్రధానంగా మార్కెట్ ఒడిదుడుకులే కారణం. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,600 డాలర్ల మార్కును అధిగమించింది. మే 18వ తేదీ తర్వాత ఈ స్థాయికి చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. బలమైన ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ ఉండటమే దీనికి ప్రధాన కారణం.

డాలర్ బలహీనపడటంతో బంగారం రేట్లతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్ సమీపిస్తుండటంతో దేశీయ మార్కెట్లలో స్పాట్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ వాతావరణం కూడా ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని బంగారంగా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
శుక్రవారం క్లోజింగ్ సమయానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలో 1,520 రూపాయల పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్లల్లో రూ. 1,400, 18 క్యారెట్లల్లో రూ. 1,140 పెరిగింది. భవిష్యత్తులో డాలర్ ఇండెక్స్ మరింత బలహీనపడితే, దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్వసిస్తున్నారు.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,309, 22 క్యారెట్లు - రూ. 14,950, 18 క్యారెట్లు - రూ. 12,730
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,309, 22 క్యారెట్లు- రూ. 14,950, 18 క్యారెట్లు - రూ. 12,232
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036













Click it and Unblock the Notifications