Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!

బంగారం ధరలు రోజురోజుకీ మారుతూ వినియోగదారుల మనసులను తొలుస్తున్నాయి. తాజాగా, నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.పెరిగేటప్పుడు మాత్రం వందల్లో దూసుకుపోయే పసిడి ధరలు, తగ్గేసరికి మాత్రం పదుల్లోనే సర్దుకుపోవడం ఆనవాయితీ..అయినా, స్వల్పంగా తగ్గిన ఈ ధరలు కొనుగోలుదారుల మొహాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి.

గ్రాముకు ఎంత తగ్గిందంటే?

నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలు ఈ రోజు కొద్దిగా వెనక్కి తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్న రూ. 8,770 ఉండగా, ఈ రోజు రూ. 8,755 కి చేరుకుంది. అంటే గ్రాముకు రూ. 15 మేర తగ్గింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 9,567 ఉండగా, ఈ రోజు రూ. 9,551 కి దిగివచ్చింది. అంటే ఒక్క గ్రాముపై రూ. 16 తగ్గింది.

gold-rates-fall-today-check-city-wise-latest-prices

ఒక్కరోజులు రూ.1600 తగ్గిన బంగారం.
ఇక 10 గ్రాముల బంగారం ధరలను చూస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ. 160 తగ్గి రూ. 95,510 వద్ద కొనసాగుతోంది. అదే 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1600 తగ్గి రూ. 9,56,700 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే, 10 గ్రాముల ధర రూ. 150 తగ్గి రూ. 87,550 అయింది. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 తగ్గి రూ. 8,77,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

నగరాల వారీగా ధరలను పరిశీలిస్తే..
హైదరాబాద్, విజయవాడ, కేరళ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 9,551 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 8,755 గా ఉంది. ఈ నగరాల్లో ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి.

కోల్‌కతా, ఢిల్లీ, లక్నో నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 9,566 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 8,770 వద్ద విక్రయించబడుతోంది. ఈ నగరాలలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్, సూరత్ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 9,556 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 8,760 వద్ద కొనసాగుతోంది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. వెండి గ్రాము ధర రూ. 109.90 ఉండగా, కిలో వెండి ధర రూ. 1,09,900 గా ఉంది. కిలో వెండిపై దాదాపు రూ. 100 మేర తగ్గింది. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. అయితే ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా లేక కొనసాగుతుందా వేచి చూడాలి. ఏది ఏమైనా, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమే అని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+