బంగారం కొనాలనే ఆలోచన చేయకండి..చాలా డేంజర్..!

దేశంలో పసిడి ధరలు మరోసారి రికార్డులను బద్దలు కొట్టాయి. ఆగస్టు 8, 2025న బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరుకుని కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. ఉదయం 6:10 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 94,010కి చేరుకుంది. ఈ ఊహించని పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, వివిధ నగరాల్లోని ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

వెండి ధరలు కూడా పైపైకి!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర ఇప్పుడు రూ. 1,17,100 వద్ద ఉంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా నగరాల మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉంటున్నాయి.

Gold Rates in august 8th 2025

ప్రధాన నగరాల్లోబంగారం, వెండి ధరలు:

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560; 22 క్యారెట్ల బంగారం రూ. 94,010; వెండి కిలో రూ. 1,27,100.

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710; 22 క్యారెట్ల బంగారం రూ. 94,160; వెండి కిలో రూ. 1,17,100.

చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560; 22 క్యారెట్ల బంగారం రూ. 94,010; వెండి కిలో రూ. 1,27,100.

ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560; 22 క్యారెట్ల బంగారం రూ. 94,010; వెండి కిలో రూ. 1,17,100.

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560; 22 క్యారెట్ల బంగారం రూ. 94,010; వెండి కిలో రూ. 1,17,100.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు కారణమయ్యాయి.అంతర్జాతీయ అనిశ్చితి: అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారడం. అమెరికా డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.

పెట్టుబడిదారుల మొగ్గు: అమెరికా అప్పులు పెరుగుతుండటంతో (36 ట్రిలియన్ డాలర్లు), పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం, వెండి వైపు మళ్లడం.

దేశీయ కారణాలు: దేశంలో దిగుమతి సుంకాలు పెరగడం, స్థానిక మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటం.

మార్కెట్‌పై ప్రభావం:
ఈ ధరల పెరుగుదల వల్ల ఆభరణాల విక్రయాలు కొంతవరకు తగ్గాయి. చాలామంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చిన్న ఆభరణాల దుకాణాల్లో వ్యాపారం 20-25% తగ్గిందని వర్తకులు చెబుతున్నారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగానే పరిగణించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ధరల పెరుగుదలను సానుకూలంగానే చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+