బంగారం.. ముట్టుకుంటే షాక్ కొట్టేలా

బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ తగిలింది. కిందటి వారంలో భారీగా తగ్గిన గోల్డ్.. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ వారంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న స్వల్ప పతనానికి సడన్ గా బ్రేక్ పడింది. పెరుగుదల బాట పట్టింది.

సోమవారం నాటితో పోల్చుకుంటే నేడు 1.2 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ. 1,070ల మేర పెరిగింది. 10 గ్రాములకు రూ. 1,24,924 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా ఈ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. దీపావళి తర్వాత పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు 9,000 రూపాయల వరకు తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్ లో ఈ పెరుగుదలకు కారణమైంది.

Gold Rates Jumps today in India on November 25 2025

డిసెంబర్‌లో అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు తక్కువ అవకాశం ఉండటం కూడా బంగారం ధరలపై కొంతమేర ప్రభావాన్ని చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా తగ్గాయి. అమెరికాలో నాన్-ఫామ్ పేరోల్ డేటా అంచనాల కంటే బలంగా రావడంతో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మిశ్రమ సంకేతాల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగవచ్చు.

సోమవారం నాటితో పోల్చుకుంటే.. గ్రాము బంగారం ధరలో 700 నుంచి 1,000 రూపాయలకు పైగా పెరుగుదల కనిపించింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,786, ముంబై- రూ. 12,704, ఢిల్లీ- రూ. 12,719, కోల్‌కతా- రూ. 12,704, బెంగళూరు- రూ. 12,704, హైదరాబాద్‌- రూ. 12,704లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో - రూ. 11,720, ముంబై- రూ. 11,645, ఢిల్లీ- రూ. 11,660, కోల్‌కతా- రూ. 11,645, బెంగళూరు- రూ. 11,645, హైదరాబాద్‌- రూ. 11,645లు. 18 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ. 9,780, ముంబై- రూ. 9,528, ఢిల్లీ- రూ. 9,543, కోల్‌కతా- రూ. 9,528, బెంగళూరు- రూ. 9,528, హైదరాబాద్‌- రూ. 9,528గా నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+