భారీగా పెరిగిన బంగారం ధరలు- బరాబర్.. !!
దేశీయ మార్కెట్ లో నేడు బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ప్రారంభ ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1.17 శాతం వృద్ధితో 1,53,195 రూపాయలకు చేరింది. వెండి ధర ఏకంగా 2.54 శాతం మేర పెరిగింది. కిలో 2,34,589 రూపాయల వద్ద స్థిరపడింది. మంగళవారం నాటి రేట్లతో పోల్చిచూస్తే ఈ రెండింటి రేట్లూ పెరిగినట్టే.
ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,200 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,350 వద్ద అమ్ముడైంది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,500, 24 క్యారెట్లు రూ.1,54,350 వద్ద ట్రేడ్ అయింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ.1,41,400, 24 క్యారెట్లు రూ.1,54,250 పలుకుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్లు రూ.1,41,350, 24 క్యారెట్లు రూ.1,54,200 వద్ద స్థిరపడింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,524, 22 క్యారెట్లు - రూ. 14,230, 18 క్యారెట్లు - రూ. 12,180
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

Click it and Unblock the Notifications