Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరలకు రెక్కలు- నెత్తిన పాలు పోసిన డొనాల్డ్ ట్రంప్

బంగారం, వెండి ధరల పతనానికి ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. ఉన్నట్టుండి బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అయిదు రోజుల పాటు మార్కెట్ ను షేక్ చేసిన అనంతరం పైపైకి ఎగబాకడం మొదలు పెట్టాయి. నేడు బంగారం, వెండి ధరల రేట్లు రెండు శాతానికి పైగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్ పై విధించిన టారిఫ్ ను 18 శాతం మేర తగ్గించడమే దీనికి ప్రధాన కారణం.

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం కారణంగా టారిఫ్ భారం తగ్గింది. దీంతో బంగారం, వెండి ధరలు తిరిగి పుంజుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, కామెక్స్ వంటి ప్రధాన మార్కెట్లలో గణనీయమైన లాభాలు నమోదు కాడం వల్ల వీటి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఎంసీఎక్స్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ 2.86 శాతం పెరిగి రూ. 1,48,106కి చేరింది. వెండి ఫ్యూచర్స్ 6.6 శాతం అధికమై కిలోకు రూ. 2.51 వద్ద ట్రేడయ్యాయి.

Gold Rates Rises While Silver Opens with Big Upside and Jumps snapping losses from the previous session

అంతర్జాతీయంగా కామెక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 3.88 శాతం జంప్ అయింది. ఔన్స్‌కు 4,833.10 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ఆరు శాతం మేర పెరిగి ఔన్స్‌కు 83.020 డాలర్ల వద్ద లాభాలతో ట్రేడయ్యాయి. అమెరికా డాలర్ బలపడుతుండటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం కూడా దీనికి కారణాలయ్యాయి. స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో కొంత పతనం కనిపించింది.

ఢిల్లీ, జైపూర్ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,900గా నమోదైంది. అహ్మదాబాద్, పూణేల్లో 22 క్యారెట్ల పసిడి రూ. 1,39,150కి, 24 క్యారెట్ల పసిడి రూ. 1,51,800కి లభ్యమవుతోంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,39,100గా ఉంది. అదేవిధంగా, ఈ నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 1,51,750గా లభిస్తోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,306, 22 క్యారెట్లు - రూ. 14,030, 18 క్యారెట్లు - రూ. 12,010

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,175, 22 క్యారెట్లు- రూ. 13,910, 18 క్యారెట్లు - రూ. 11,380

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,175, 22 క్యారెట్లు- రూ. 13,910, 18 క్యారెట్లు- రూ. 11,381

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,175, 22 క్యారెట్లు- రూ. 13,910, 18 క్యారెట్లు- రూ. 11,381

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,175, 22 క్యారెట్లు- రూ. 13,910, 18 క్యారెట్లు- రూ. 11,381

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,175, 22 క్యారెట్లు- రూ. 13,910, 18 క్యారెట్లు- రూ. 11,381

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+