తస్మాత్ జాగ్రత్త.. పైపైకి ఎగబాకుతున్న పసిడి
బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ తగిలింది. కిందటి వారంలో భారీగా తగ్గిన గోల్డ్.. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ వారంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న స్వల్ప పతనానికి సడన్ గా బ్రేక్ పడింది. పెరుగుదల బాట పట్టింది.
మంగళవారం నాటితో పోల్చుకుంటే నేడు కూడా 0.42 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ. 530ల మేర పెరిగింది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం రూ. 1,26,060 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,15,555, 18 క్యారెట్లు రూ. 94,545 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా ఈ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి.

డిసెంబర్‌లో అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు తక్కువ అవకాశం ఉండటం కూడా బంగారం ధరలపై కొంతమేర ప్రభావాన్ని చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా తగ్గాయి. అమెరికాలో నాన్-ఫామ్ పేరోల్ డేటా అంచనాల కంటే బలంగా రావడంతో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మిశ్రమ సంకేతాల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగవచ్చు.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,787, ముంబై- రూ. 12,705, ఢిల్లీ- రూ. 12,720, కోల్‌కతా- రూ. 12,705, బెంగళూరు- రూ. 12,705, హైదరాబాద్- రూ. 12,705లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో - రూ. 11,721, ముంబై- రూ. 11,646, ఢిల్లీ- రూ. 11,661, కోల్‌కతా- రూ. 11,646, బెంగళూరు- రూ. 11,646, హైదరాబాద్- రూ. 11,646లు. 18 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ. 9,781, ముంబై- రూ. 9,529, ఢిల్లీ- రూ. 9,544, కోల్‌కతా- రూ. 9,529, బెంగళూరు- రూ. 9,529, హైదరాబాద్- రూ. 9,529గా నమోదైంది.












Click it and Unblock the Notifications