Gold Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లి పెరిగిన బంగారం ధరలు!

కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన ధరలు, నేడు ఒక్కసారిగా పెరగడంతో పసిడి ప్రియులకు కాస్త నిరాశ కలిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పుంజుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం వంటి కారణాల వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో బంగారం ధరల జోరు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముపై రూ.50 పెరిగి రూ. 8,040కి చేరింది. 8 గ్రాముల బంగారం ధర రూ.64,320గా నమోదు కాగా, 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.80,400కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.500 పెరిగింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గ్రాము ధర రూ.8,771 పలుకుతుండగా, 8 గ్రాముల ధర రూ.70,168గా ఉంది. 10 గ్రాముల ధర రూ.87,710కి చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు 10 గ్రాముల ధర రూ.550 పెరిగింది.

Gold Rates Today Check Latest Prices in Hyderabad Vijayawada Chennai

విజయవాడ- చెన్నైలోనూ అదే పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముపై రూ.50 పెరిగి రూ. 8,040కి చేరింది. 8 గ్రాముల బంగారం ధర రూ.64,320గా నమోదు కాగా, 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.80,400కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.500 పెరిగింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గ్రాము ధర రూ.8,771 పలుకుతుండగా, 8 గ్రాముల ధర రూ.70,168గా ఉంది. 10 గ్రాముల ధర రూ.87,710కి చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు 10 గ్రాముల ధర రూ.550 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ.. ఇదే స్థాయిలో పసిడి ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు స్థిరం..
బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక గ్రాము వెండి ధర రూ. 108.10 గానూ, 8 గ్రాముల వెండి ధర రూ. 864.80 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 1,081 గానూ ఉంది. కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,08,100 గానే ఉంది.

బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. కాబట్టి, పెట్టుబడి పెట్టాలనుకునేవారు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించి, సరైన సమయంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు.

గమనిక: ఈ ధరలు కేవలం అంచనా మాత్రమే. ఆభరణాల తయారీ ఛార్జీలు, GST (వస్తువులు మరియు సేవల పన్ను) వంటి అదనపు ఛార్జీల కారణంగా ధరల్లో మార్పులు ఉండవచ్చు. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+