Gold Price Today : బంగారం పరుగులు.. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ధరలు!
బంగారం... ఇది కేవలం ఒక లోహం కాదు, భారతీయులకు ఇది ఒక సెంటిమెంట్, ఒక పెట్టుబడి, ఒక ఆభరణం. పెళ్లిళ్లలో, పండుగల్లో, శుభకార్యాలలో బంగారం లేనిదే ముహూర్తం ముందుకు కదలదు. అటువంటి పసిడి ధరలు రోజురోజుకు పరుగులు పెడుతుండటంతో సామాన్యుడికి కన్నీళ్లే మిగులుతున్నాయి. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలు నేడు అందని ద్రాక్షలా మారుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
సోమవారం నాటి ధరలతో పోలిస్తే మంగళవారం ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 85 పెరిగింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 93 మేర పెరగడం గమనార్హం. ఈ ధరల పెరుగుదల సామాన్యుడికి గుండె గుభేలుమనేలా చేస్తోంది.

హైదరాబాద్, విజయవాడలో ఇలా..
దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఒక తులం (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 85,100 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 92,840 పలికింది. సోమవారం నాటి ధరలతో పోలిస్తే ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 850 నుంచి రూ. 930 వరకు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఢిల్లీ, చెన్నైలో గోల్డ్ ధరలు ..
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల మోత మోగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 850 పెరిగి రూ. 85,250కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 930 పెరిగి రూ. 92,990 వద్దకు చేరింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒకే విధంగా పెరుగుతుండటం గమనార్హం. చెన్నై నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 85,100కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 930 పెరిగి రూ. 92,840 వద్ద స్థిరపడింది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం కొనాలనుకునేవారికి ఈ ధరలు మింగుడుపడనివిగా మారాయి.
బంగారం బాటలోనే వెండి
బంగారం ధరలు పెరుగుతుంటే వెండి మాత్రం వెనుకడుగు వేస్తుందా? లేదు! వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. మంగళవారం వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్క కేజీ వెండి ధర సోమవారంతో పోలిస్తే ఏకంగా రూ. 1000 పెరిగి రూ. 1,14,000 వద్దకు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో సామాన్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలేంటి?
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీని వెనుక అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్ మారకం విలువలో మార్పులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, పెళ్లిళ్ల సీజన్, పండుగలు వంటి సమయాల్లో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications