Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు

బంగారం ధరలు నేడు కూడా కుప్పకూలిపోయాయి. వీటి రేట్లు భారీగా తగ్గడం వరుసగా ఇది నాలుగోరోజు. మున్ముందు ఇంకా తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆదివారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం బంగారం ధరల్లో 3.5 శాతం మేర క్షీణత కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో కిందటి రోజు సాయంత్రం 1,41,090 రూపాయల వద్ద బంగారం ట్రేడింగ్ ముగిసింది. ఇప్పుడు 3.5 శాతం మేర తగ్గుదలతో 1,37,951 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. 4.000 రూపాయలకు పైగా క్షీణత కనిపించింది.

ఆ తరువాత కొంత పుంజుకొంది.ఆ తరువాత కొంత పుంజుకొంది. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,130 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,900గా నమోదైంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ మూడు శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,43,321 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆరు శాతం పడిపోయి కిలోకు రూ. 2,49,731కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 50,000 తగ్గి రూ.3,00,000ల దిగువకు చేరుకుంది.

Gold Slumps at MCX Near 3 Percent as CME Margin Hikes Spark Selloff of Precious Yellow Metal

ముంబై, హైదరాబాద్, చెన్నైల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,51,130, ఢిల్లీ, జైపూర్ లల్లో రూ. 1,51,280 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ముంబై, హైదరాబాద్, చెన్నైల్లో రూ. 1,38,900, ఢిల్లీ, జైపూర్ లల్లో రూ. 1,39,000 నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఇదే తగ్గుదల కనిపించింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 4,605.49 డాలర్లకు పడిపోయింది. కామెక్స్ లో ఆదివారం నాడు స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,879 డాలర్లు పలికింది. ఇప్పుడది 4,605 డాలర్లకు క్షీణించింది. ఈ పరిణామాలు బంగారం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. అయోమయ స్థితిలోకి నెట్టాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,218, 22 క్యారెట్లు - రూ. 13,950, 18 క్యారెట్లు - రూ. 12,000

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,980, 18 క్యారెట్లు - రూ. 11,365

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు- రూ. 11,365

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు- రూ. 11,365

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు- రూ. 11,365

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు- రూ. 11,365

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+