ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు

బంగారం ధరల్లో ఊగిసలాట నెలకొంది. దేశీయంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కొనుగోలుదారుల ఆశలు ఆవిరి చేస్తోన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం తీవ్రం కావడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఆశ్రయిస్తోండటం, అమెరికన్ డాలర్ బలహీనపడటం కూడా వీటి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిణామాలు పసిడి రేట్లను కుదురుగా ఉండనివ్వట్లేదు.

ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 1,64,500 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,790 వద్ద లభ్యమవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.63 శాతం మేర పెరిగింది. 10 గ్రాములకు 1,62,542 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా 1.62 శాతం మేర పెరిగి కిలో రూ. 2,69,895గా నమోదైంది. అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి నెలకొంది.

Gold Surges as Mumbai 24K Reaches Rs 164500 per 10 per gram and Silver Climbs on Safe-Haven Demand

యూఎస్ స్పాట్ గోల్డ్ 0.8 శాతం వరకు పెరిగింది. ఔన్సు 5,177.26 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ డెలివరీల్లో ఒక శాతం పెరుగుదల కనిపించింది. 5,186.40 డాలర్ల వద్ద నిలిచాయి. ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,50,940, 24 క్యారెట్లు రూ. 1,64,650 లకు లభిస్తోంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,50,840, 24 క్యారెట్లు రూ. 1,64,550గా నమోదైంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,50,790, 24 క్యారెట్లు రూ.1,64,500 వద్ద ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,495, 22 క్యారెట్లు - రూ. 15,120, 18 క్యారెట్లు - రూ. 13,039

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,353, 22 క్యారెట్లు- రూ. 15,990, 18 క్యారెట్లు - రూ. 12,265

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,353, 22 క్యారెట్లు- రూ. 15,990, 18 క్యారెట్లు - రూ. 12,265

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,353, 22 క్యారెట్లు- రూ. 15,990, 18 క్యారెట్లు - రూ. 12,265

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,353, 22 క్యారెట్లు- రూ. 15,990, 18 క్యారెట్లు - రూ. 12,265

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,353, 22 క్యారెట్లు- రూ. 15,990, 18 క్యారెట్లు - రూ. 12,265

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+