జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కార్ల ధరలు
GST 2.0: జీఎస్టీ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించిన కారణంగా కార్ల ధరలు తగ్గుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించిన తర్వాత మహీంద్రా, టయోటా, రెనాల్ట్, టాటా, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కార్ల కంపెనీలు తమ మోడళ్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ ధరల తగ్గింపు నిర్ణయం కస్టమర్లకు ఎంతో లబ్ధి చేకూరుస్తోంది.
ఏ మోడళ్ల ధరలు ఎంత తగ్గాయంటే?
మహీంద్రా:
జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో మహీంద్రా తన మోడళ్ల ధరలను రూ.1.56 లక్షల వరకు తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చాయి.
*బొలెరో నియో ధర రూ.1.27 లక్షలు తగ్గింది.
*ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పెట్రోల్ వెర్షన్ రూ.1.40 లక్షలు, డీజిల్ వెర్షన్ రూ.1.56 లక్షలు తగ్గాయి.
* థార్ ధర రూ.1.35 లక్షల వరకు, థార్ రాక్స్ రూ.1.33 లక్షలు తగ్గింది.
*స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ ధరలు వరుసగా రూ.1.01 లక్షలు, రూ.1.45 లక్షలు తగ్గాయి.
*ఎక్స్‌యూవీ 700 ధర రూ.1.43 లక్షలు తగ్గింది.

టాటా:
టాటా మోటార్స్ కూడా తమ మోడళ్లపై రూ. 1.45 లక్షల వరకు ధర తగ్గించింది.
*టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ ధరలు వరుసగా రూ. 75,000, రూ. 80,000, రూ. 1.10 లక్షలు తగ్గాయి.
*పంచ్, నెక్సాన్ ధరలు వరుసగా రూ. 85,000, రూ. 1.55 లక్షలు తగ్గాయి.
*కర్వ్ ధర రూ. 65,000 తగ్గింది.
*హారియర్, సఫారీ ధరలు వరుసగా రూ. 1.4 లక్షలు, రూ. 1.45 లక్షలు తగ్గాయి.
టయోటా:
*టయోటా తమ మోడళ్లపై రూ.3.49 లక్షల వరకు ధర తగ్గించింది. ఈ ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.
*ఫార్చ్యూనర్ ధర గరిష్టంగా రూ. 3.49 లక్షలు తగ్గింది.
*లెజెండర్ రూ. 3.34 లక్షలు, హిలక్స్ రూ. 2.52 లక్షలు, వెల్ఫైర్ రూ. 2.78 లక్షలు, కామ్రీ రూ. 1.01 లక్షలు తగ్గాయి.
*ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ ధరలు వరుసగా రూ. 1.80 లక్షలు, రూ. 1.15 లక్షలు తగ్గాయి.
*ఇతర మోడళ్ల ధరలు రూ. 1.11 లక్షల వరకు తగ్గనున్నాయి.
రెనాల్ట్:
రెనాల్ట్ కూడా తమ మోడళ్ల ధరలను తగ్గించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే వినియోగదారులు సెప్టెంబర్ 6 నుంచి తగ్గించిన ధరలకే బుక్ చేసుకోవచ్చు.
*రెనాల్ట్ ధరలు రూ. 96,000 వరకు తగ్గుతాయి. ఇందులో కైగర్ ధర గరిష్టంగా రూ. 96,395 తగ్గుతుంది.
బీఎండబ్ల్యూ:
బీఎండబ్ల్యూ కూడా జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఈ కంపెనీ కార్ల ధరలు రూ. 8.9 లక్షల వరకు తగ్గాయి.
*2 సిరీస్ గ్రాన్ కూపే - రూ. 45.3 లక్షలు
*3 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ - రూ. 60.5 లక్షలు
*5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ - రూ. 72.4 లక్షలు
*ఎక్స్1 - రూ. 50.6 లక్షలు
*ఎక్స్5 - రూ. 93.7 లక్షలు
*ఎక్స్7 - రూ. 1.2 కోట్లు
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications