30 ఏళ్లుగా నంబర్ వన్: 1994లో వచ్చి నేటికీ రికార్డులు తిరగరాస్తున్న బైక్!

1994లో విడుదలైన హీరో స్ప్లెండర్ బైక్ ఇప్పటికీ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా ఇది తన రికార్డును కొనసాగిస్తోంది. ఇతర మోడల్స్ ఎన్ని ఉన్నా ఇప్పటికీ ఎక్కువ మంది దీనినే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దేశంలో అనేక విభిన్న సెగ్మెంట్లలో, వివిధ ధరల శ్రేణులలో బైకులు అందుబాటులో ఉన్నప్పటికీ.. హీరో స్ప్లెండర్ ప్రజలకు అత్యంత ఇష్టమైన ఎంపికగా నిలిచింది. కాలంతో పాటు కంపెనీ ఈ బైక్‌లో అనేక మార్పులు, కొత్త ఫీచర్లను జోడించడం వల్ల ఈ బైక్ నేటికీ తన సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉంది.

అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్
హీరో స్ప్లెండర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్ ఇదే కావడం గమనార్హం. దీనిని సేల్స్ రిపోర్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇటీవల విడుదలైన అక్టోబర్ 2025 విక్రయాల జాబితాలో ఎప్పటిలాగే స్ప్లెండర్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో 3,40,131 యూనిట్లతో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా ఉంది. మొత్తం అమ్మకాలలో దీని వాటా 32.08 శాతంగా ఉంది. హీరో మోటోకార్ప్ విక్రయించిన మొత్తం ద్విచక్ర వాహనాలలో స్ప్లైండర్ వాటా 50 శాతానికి పైగా ఉండటం విశేషం. దీని అర్థం హీరో అమ్ముతున్న ప్రతి రెండు టూ-వీలర్లలో ఒకటి స్ప్లెంటరే కావడం గమనార్హం.

Hero Splendor India No 1 Bike for 30 Years 1994 Legend Still Breaking Sales Records

స్ప్లెండర్ ప్రజాదరణకు కారణాలు
స్ప్లెండర్ బైక్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి. హీరో స్ప్లెండర్ దాని విశ్వసనీయ ఇంజనీరింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏళ్ల తరబడి ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా నడుస్తుంది. అందుకే ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజాదరణ పొందింది. ఈ మోటార్ సైకిల్ లీటరుకు 70 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. పెరుగుతున్న పెట్రోల ధరల నేపథ్యంలో స్ప్లెండర్ అద్భుతమైన మైలేజ్ దీనికి అతిపెద్ద బలం. తక్కువ రన్నింగ్ ఖర్చు కారణంగా రోజువారీ వినియోగానికి ఇది అత్యంత సరసమైన ఎంపిక.

హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా అతిపెద్ద సర్వీస్, డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీని విడి భాగాలు ప్రతి చిన్న, పెద్ద నగరంలో సులభంగా, తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సరసమైన ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.73,902 నుంచి రూ.76,437 మధ్య ఉంది. తక్కువ ధర కారణంగా దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+