HRA లో పెద్ద మార్పు! ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..

మధ్యతరగతి జీతజీవులకు ఊరట కలిగించే శుభవార్త త్వరలో రానుందా? అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రతి నెల జీతంలో పెద్ద భాగాన్ని రెంట్‌కే ఖర్చు చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక సాయం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే ఉద్యోగులకు మరింత లాభం చేకూర్చేలా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) నిబంధనల్లో పెద్ద మార్పులు చేయాలనే ప్రతిపాదనపై కేంద్రం ఆలోచనలు చేస్తోంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో తరహా నగరాల్లో నివసించే ఉద్యోగుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ సవరణ ఉండనుంది.

HRA

HRA పన్ను మినహాయింపు..

ప్రస్తుతం దేశంలో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి నాలుగు మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులకు మాత్రమే జీతంలో 50 శాతం వరకు HRA పన్ను మినహాయింపు లభిస్తోంది. మిగతా నగరాలు, పట్టణాల్లో పనిచేసే వారికి ఇది 40 శాతంకే పరిమితం.

అయితే, ఈ అసమానతను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలను కూడా హై రెంట్ సిటీల జాబితాలో చేర్చి, అక్కడ నివసించే ఉద్యోగులకు 50 శాతం HRA మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది.

ఈ సవరణ అమల్లోకి వస్తే, దేశంలో మొత్తం ఎనిమిది నగరాల్లో నివసించే ఉద్యోగులు పూర్తి స్థాయి HRA పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మిగతా నగరాలు, పట్టణాల్లో పనిచేసే వారికి ఇప్పటిలాగే 40 శాతం మినహాయింపు కొనసాగనుంది.

జనాభా అనుగుణంగా..

గత పదేళ్లలో ఐటీ, తయారీ, సేవారంగాల విస్తరణతో హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో గృహ అద్దెలు ఆకాశాన్ని తాకాయి. ఈ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, పట్టణ జనాభా అనుగుణంగా HRA నిబంధనలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రతిపాదన అమలైతే, ముఖ్యంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఆర్థిక లాభం కలగనుంది. ఎందుకంటే కొత్త పన్ను విధానంలో HRA మినహాయింపు అందుబాటులో లేకపోవడం వల్ల, పాత విధానం ఇప్పటికీ అనేకమందికి ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+