ఈ 3 షేర్లతో కాసుల వర్షం.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు

దేశీయ ఈక్విటీ బారోమీటర్ ఈరోజు ట్రేడింగ్‌లో మంచి జోరుమీదుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండటంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 423 పాయింట్ల లాభంతో 62 వేల 925 మార్క్ వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 సూచీ 118 పాయింట్ల లాభంతో 18 వేల 617 మార్క్ వద్ద కొనసాగుతోంది. కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్, ఇండస్ ఇండ్, హిందాల్కో, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

మంచి జోషైన వాతావరణం కనిపిస్తున్న వేళ ఇంట్రాడేలో మూడు షేర్లు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే వారు వీటిని ఓసారి పరిశీలించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

 trending stock

ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ (ICICI Lombard General Insurance):
మార్కెట్లు ప్రారంభమైన కొంతసేపటికే ఏకంగా 11 శాతం మేర షేరు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్‌లో తమ వాటాను 4 శాతం పెంచాలని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ బ్యాంక్ షేర్ దూసుకెళ్తోంది. ఐసీఐసీఐ లాంబార్డ్ స్టాక్ 9.39 శాతం పెరిగి రూ.1,203 వద్ద కొనసాగుతోంది (ఉదయం సమయానికి).

హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ (HealthCare Global Enterprises):
నాగ్‌పూర్‌లో కంపెనీ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. హెచ్‌సీడీ ఎన్‌సీహెచ్ఆర్ఐ అంకాలజీ అనే అనుబంధ సంస్థను విస్తరించబోతున్నట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్‌లో తమకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నామని చెప్పడంతో ఈ కంపెనీ షేర్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి.

 trending stock

న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ (Nucleus Software Exports):
ఈ కంపెనీ షేరు ప్రారంభంలోనే 20 శాతం పెరిగింది. రూ.971 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఏకీకృత ప్రాఫిట్ ట్యాక్స్ తర్వాత రూ.127.79 కోట్లుగా ప్రకటించింది. అలాగే వృద్ధి రేటు 212.37 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన క్యూ4లో ఏకీకృత లాభం రూ.67.65 కోట్లు కాగా, గ్రోత్ రేటు 76.45 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+