ICICI Prudential AMC Listing: భారీ లాభాలు.. పండగ చేసుకోండి

ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యాయి. భారీ స్థాయి ప్రీమియంతో అరంగేట్రం చేశాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అద్భుతమైన లాభాలతో లిస్ట్ అయ్యాయి. గ్రే మార్కెట్ అంచనాలతో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ- ఎన్‌ఎస్‌ఈలో 20.09, బీఎస్‌ఈలో 20.38 శాతం లాభాలతో లిస్టింగ్ పూర్తయింది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ ఈ నెల 12న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 వరకు అందుబాటులో ఉంది. రూ. 10,603 కోట్లను సమీకరించుకోవడానికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు వచ్చింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ. ఒక్కో లాట్ లో ఆరు షేర్లు. ఒక్కో షేరుకు రూ. 2,160 నుండి రూ. 2,165 వరకు ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ కింద 4,89,72,994 షేర్లను విక్రయానికి ఉంచింది.

ICICI Prudential AMC IPO Strong Debut as Shares List at 20 Above Issue Price

ఈ ఇష్యూలోని కంపెనీ షేర్లు ఈ ఉదయం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో రూ. 2,600, బీఎస్‌ఈలో రూ.2,606.20 వద్ద లిస్టింగ్ అయ్యాయి. దాదాపుగా 450 రూపాయలు అధికంగా రిటర్న్ ఇచ్చిందీ ఐపీఓ. ఒకదశలో గరిష్ఠంగా 2,496 రూపాయలకు వెళ్లింది గానీ.. ఆ తర్వాత క్షీణించింది. ప్రస్తుతం ఒక్కో షేర్ పై 422 రూపాయల లాభంతో 2,581 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ (ICICI Prudential AMC IPO Listing) మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరిగింది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 1,29,552.57 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఐపీఓకి పెట్టుబడిదారుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సబ్‌స్క్రిప్షన్ చివరి రోజు నాటికి, ఇది మొత్తం 39.17 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగంలో అత్యధికంగా 123.67 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ) విభాగంలో 22.04 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 2.53 రెట్లు నమోదైంది. జీఎంపీ ఒక్కో షేర్ కు 470 రూపాయలుగా అంచనా వేసింది. దీంతో పోలిస్తే తక్కువగానే నమోదైంది గానీ లాభాలు మాత్రం తగ్గలేదు. 685 వద్ద లిస్ట్ అవ్వొచ్చని జీఎంపీ అంచనా వేసింది. కొద్దిగా తగ్గి రూ.2,606 వద్ద లిస్ట్ అయింది. ఒక లాట్ కు 12,990 పెట్టుబడి పెట్టిన వారికి, లిస్టింగ్ తర్వాత అది రూ. 15,600 రూపాయల మేర లాభం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+