ఓమైగాడ్: 1 డాలర్ = రూ. 90.13 పైసలు: రూపాయి తుక్కు తుక్కు
రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతంగా క్షీణించింది. ఒక డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా 90 రూపాయలను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 90.13 పైసలకు చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. 90 రూపాయల మార్క్ ను దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది.
ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో రూపాయి విలువ దిగజారిపోలేదు. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మంగళవారం నాటితో పోల్చుకుంటే ఒకేసారి 25 పైసల మేర క్షీణించడం అనేది మార్కెట్ వర్గాలను సైతం మింగుడుపడట్లేదు. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బోంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నష్టాలతో ఆరంభం అయ్యాయి. వ్యాపారాలపై అధిక వ్యయ భారం పడినట్టయింది. దిగుమతుల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది.
దేశ మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం వంటివి ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. రూపాయి విలువ పడిపోవడం ఊహించినప్పటికీ- దాని వేగం మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈ అస్థిరతను తగ్గించడానికి నివారణ చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ చెబుతూ వస్తోంది గానీ దాని ఫలితం జీరో అనడానికి ఇదే తాజా ఉదాహరణ
బలహీనమైన విదేశీ పోర్ట్‌ఫోలియోలు, పెండింగ్‌లో ఉన్న అమెరికా- భారత్ ట్రేడ్ అగ్రిమెంట్స్, అందులో కొనసాగుతున్న అనిశ్చితి వంటివి రూపాయి పతనానికి దారి తీశాయి. రూపాయి విలువ క్షీణించిన ప్రభావం వ్యాపారాలపై నేరుగా పడుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక వస్తువుల దిగుమతుల భారం ఖజానాపై పడుతుంది. విదేశీ రుణాలు ఉన్న కంపెనీలకు తిరిగి చెల్లింపు ఖర్చులు అధికమయ్యాయి.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications