భారత్‌లో అదానీ గ్రీన్ఎనర్జీ కొత్త చరిత్ర: 15వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి..!!

Adani Green Energy (AGEL):భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) చరిత్ర సృష్టించింది. ఏకంగా 15,000 మెగావాట్ల (MW) నిర్వహణ సామర్థ్యాన్ని అధిగమించి, మొత్తం 15,539.9 మెగావాట్లకు చేరుకుంది. దేశంలో ఇంత వేగంగా, ఇంత పెద్ద మొత్తంలో సామర్థ్యాన్ని పెంచిన తొలి, ఏకైక సంస్థగా AGEL నిలిచింది. ఈ మొత్తం సామర్థ్యంలో దాదాపు 11,005.5 మెగావాట్లు సౌర విద్యుత్ కాగా, 1,977.8 మెగావాట్లు పవన విద్యుత్, మరియు 2,556.6 మెగావాట్లు పవన-సౌర హైబ్రిడ్ విద్యుత్ ఉన్నాయి. ఈ మైలురాయిని ఎక్కువగా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ద్వారా సాధించడం విశేషం.

ఈ ఘనతపై AGEL CEO ఆశిష్ ఖన్నా మాట్లాడారు.15,000 మెగావాట్ల మైలురాయిని అధిగమించడాన్ని గర్విస్తున్నామని అన్నారు. ఇది తమ బృందం యొక్క అవిశ్రాంత కృషికి నిదర్శనమన్నారు. ప్రమోటర్ల దార్శనికత, ఇన్వెస్టర్లు,కస్టమర్‌లు,బృందం,భాగస్వాముల నిరంతర మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అదానీని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టాలనే గౌతమ్ అదానీ ఆశయంతో, అదానీ గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణ మరియు నిర్వహణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆశిష్ ఖన్నా చెప్పారు. క్లీన్ ఎనర్జీని అసాధారణ స్థాయిలో, వేగంతో అందించవచ్చని తాము నిరూపిస్తున్నామని వెల్లడించారు.2030 నాటికి 15,000 మెగావాట్ల నుండి 50,000 మెగావాట్లకు వేగంగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశానికి, ప్రపంచానికి స్థిరమైన ఇంధన పరిష్కారాలను అందించేందుకు తాము ఎప్పుడు సిద్దంగానే ఉంటామని చెప్పుకొచ్చారు.

indias-green-energy-revolution-adani-green-hits-15-gw-aims-for-50-gw-by-2030

అదానీ గ్రీన్ ఎనర్జీ యొక్క 15,539.9 మెగావాట్ల నిర్వహణ సామర్థ్యం సుమారు 7.9 మిలియన్ల గృహాలకు విద్యుత్ అందించగలదు. ఈ స్వచ్ఛమైన శక్తి పదమూడు భారతీయ రాష్ట్రాలకు వెలుగునందిస్తోంది. అంతేకాకుండా, AGEL యొక్క ఆపరేషనల్ పోర్ట్‌ఫోలియో మొత్తం ఈశాన్య భారతదేశానికి పునరుత్పాదక శక్తిని అందించగల సామర్థ్యం ఉంది. AGEL సంస్థ భారత్‌కు నాణ్యమైన విద్యుత్‌ను అతి తక్కువ ధరకే అందించి 10 ఏళ్లు పూర్తయిన వేళ ఈ సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం.

ప్రస్తుతం, అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఖావ్‌డాలో ప్రపంచంలోనే అతిపెద్ద 30,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పారిస్ నగరం కంటే ఐదు రెట్లు పెద్దది. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. పూర్తయిన తర్వాత, ఇది అన్ని రకాల ఇంధన వనరులలో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్‌గా నిలుస్తుంది. ఇప్పటివరకు, AGEL ఖావ్‌డాలో 5,355.9 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని నిర్వహణలోకి తెచ్చింది. ఖావ్‌డాలో ఈ వేగవంతమైన పురోగతి, 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి AGEL యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+