చందా కొచ్చార్ భర్తకు రెండోసారి ఐటీ డిపార్టుమెంట్ నోటీసులు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్‌కు ఐటీ అధికారులు రెండోసారి నోటీసులు పంపించారు. వీడియోకాన్ లోన్ ఇష్యూలో పన్ను ఎగవేతకు సంబంధించి దర్యాఫ్తులో భాగంగా సోమవారం నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఈ వ్యవహారంలో దీపక్‌కు చెందిన సంస్థకు ఏప్రిల్ మొదటి వారంలో నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్నేళ్లకు సంబంధించి వ్యక్తిగత ఆదాయాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, ఆయన కంపెనీ న్యూపవర్ రెన్యూవబుల్స్‌కు చెందిన వ్యాపార లావాదేవీల వివరాలను సమర్పించాలని పేర్కొంది. దీనిపై ఆయన స్పందించలేదు. దీంతో మళ్లీ నోటీసులు ఇచ్చింది.

కాగా, ఆరేళ్ల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ తీసుకున్న రుణం వ్యవహారంలో వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్, దీపక్‌లపై ఆరోపణలు వచ్చాయి. సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
దీంతో పాటు 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణం వ్యవహారంలో క్విడ్ ప్రోకో ప్రాతిపదికన లబ్ధి చేకూర్చారా అనే విషయాన్ని తేల్చేందుకు బ్యాంకుకు చెందిన కొందరు అధికారులను సీబీఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కోసం వీడియోకాన్ గ్రూపు ప్రమోటర్ వేణు గోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్, మరికొందరి పేర్లను చేర్చింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications