జియో సెన్సేషన్- యాంకర్ బిడ్డింగ్ కోసం క్యూ కట్టిన టాప్ కంపెనీలు: రూ. 2.5 లక్షల కోట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతోంది. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నాహాలు పూర్తి చేసింది. రిలయన్స్ డిజిటల్ వింగ్ జియో ప్లాట్‌ఫార్మ్స్ భారీ ఐపీఓకు సిద్ధమైంది. దీని విలువ 30,213 కోట్ల రూపాయలు. ఈ ఐపీఓ ఈ నెల 21న సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. 23 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్స్ రూ. 27,859 కోట్ల ఐపీఓ జియో దాటిపోనుంది.

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ఒక్కో షేర్ ప్రైస్ రూ. 1,065 నుంచి రూ. 1,119 గా నిర్ణయించారు. ఒక లాట్ లో 12 షేర్లు ఉంటాయి. ఒక లాట్ కొనడానికి రూ. 13,428 లను కేటాయించాల్సి ఉంటుంది. ఒక్కో రిటైలర్ గరిష్టంగా 12 బిడ్స్ దాఖలు చేయవచ్చు. గరిష్ఠ ధర ఆధారంగా కంపెనీ 27 కోట్ల ఫ్రెష్ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ. 2,500 కోట్లు, అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఎంప్లాయిస్ కేటగిరీలో బిడ్ వేసేవారికి ప్రతి షేరుపై రూ. 54 తగ్గింపు లభిస్తుంది.

Jio IPO attracted institutional demand of about Rs 2 5 lakh crore Rs 8110 cr anchor book 30 times

ఐపీఓ ఇష్యూ కావడానికి ముందే అపూర్వ స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన యాంకర్ బుక్ కోసం దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల మేర భారీ డిమాండ్ నమోదైంది. రూ. 8,110 కోట్ల విలువైన యాంకర్ వాటాల కోసం దేశ, విదేశాల్లో ఉన్న సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి అపరిమితంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల కంటే దాదాపు 30 రెట్లకు పైగా బిడ్లు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు
టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు

జియో యాంకర్ బుక్‌లో భాగస్వామ్యం పొందడానికి అనేక అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు పోటీ పడ్డాయి. బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, టీ రో ప్రైస్, స్క్రోడర్స్, జేపీమోర్గన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు బిడ్లు దాఖలు చేశాయి. వీటితో పాటు సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, నార్వే నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో నిలిచాయి.

4 రోజులుగా రెక్కీ.. 45 నిమిషాల వెయిటింగ్: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపిన నిందితుల పట్టివేత
4 రోజులుగా రెక్కీ.. 45 నిమిషాల వెయిటింగ్: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపిన నిందితుల పట్టివేత

దేశీయంగా అనేక ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు, ఫిన్ టెక్స్ ఈ ఐపీఓలో పాల్గొన్నాయి. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పాన్ ఇండియా, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన ఫండ్ హౌస్‌లు బిడ్స్ వేశాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్స్ వంటి ప్రముఖ సంస్థలు ముందుకు రావడం.. జియో ఐపీఓకు ఉన్న ఆదరణకు అద్దంపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+