జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి

దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో జియో ప్లాట్‌ఫార్మ్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్.. నూతన అధ్యాయానికి తెర తీసింది. సబ్ స్క్రిప్షన్ కోసం జారీ చేసిన ఇష్యూల అనేక రెట్లు అధికంగా బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటైలర్ల నుంచి ఏకంగా కోటికి పైగా బిడ్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ ఐపీఓ ముగియడానికి సాయంత్రం వరకూ గడువు ఉన్నందున వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

ఈ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఏకంగా 10 మిలియన్లు.. అంటే కోటికి పైగా బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. ఈ రేంజ్ లో బిడ్స్ దాఖలు కావడం ఐపీఓ చరిత్రలోనే ఓ నూతన రికార్డ్. అందుబాటులో ఉంచిన 19.75 కోట్ల షేర్లకు గాను దాదాపు 136.32 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఈ ఐపీవో మొత్తం ఏడు రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో అత్యధికంగా 14.46 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి. దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బిడ్లు వేశారు.

Jio Platforms has shattered global primary market records becoming the 1st IPO to cross 1 crore

నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో దాదాపు 9.45 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. రీటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో కేటాయించిన షేర్లకు 2.02 రెట్ల ఆదరణ లభించింది. అలాగే కంపెనీ షేర్‌హోల్డర్లకు కేటాయించిన వాటా 5.68, ఉద్యోగుల రిజర్వేషన్ కోటా 2.48 రెట్లు బిడ్డ్ వచ్చాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మార్కెట్ విలువ సుమారు 108 బిలియన్ డాలర్లకు చేరింది. టైర్-2, టైర్-3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ ఐపీఓ బిడ్డింగ్‌లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హాట్ కేక్ లా జియో ఐపీఓ: అరగంటలోనే ఫుల్లీ బుక్డ్: స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్
హాట్ కేక్ లా జియో ఐపీఓ: అరగంటలోనే ఫుల్లీ బుక్డ్: స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్

బిడ్డింగ్స్ దాఖలు చేయడానికి నేడు ఆఖరి రోజు. సాయంత్రం 6:50 నిమిషాల వరకు గడువు ఉన్నందున బిడ్డింగ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు అత్యధిక దరఖాస్తులు సాధించిన రికార్డు వ్యారీ ఎనర్జీస్ కంపెనీ పేరిట ఉండేది. ఆ కంపెనీ ఐపీఓ సమయములో దాదాపు 97 లక్షల దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్ దాన్ని అధిగమించింది. అలాగే గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బీసీసీఎల్ వంటి ప్రముఖ కంపెనీల ఐపీఓలు కూడా దాదాపు 90 లక్షల దరఖాస్తుల స్థాయిని తాకాయి. అవన్నీ కూడా కనుమరుగు అయ్యాయి.. జియో ధాటికి.

ఆల్ టైమ్ హై: జియో ఐపీఓ పూర్తి వివరాలు
ఆల్ టైమ్ హై: జియో ఐపీఓ పూర్తి వివరాలు

జియో ప్లాట్ ఫామ్స్ ఐపీఓ ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,065 నుంచి రూ.1,119. రిలయన్స్ ఇండస్ట్రీస్ అర్హులైన వాటాదారులకు రూ.2,500 కోట్లు, అలాగే కంపెనీ ఉద్యోగులకు రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఉద్యోగులకు నిర్ణయించిన తుది ఆఫర్ ధరపై షేరుకు రూ.54 వరకు డిస్కౌంట్ లభించనుంది. మొత్తం 30,213 కోట్ల రూపాయలను సేకరించడానికి ఈ ఐపీఓ ఇష్యూ అయింది.

అలాట్‌మెంట్ ప్రక్రియ 26 నాటికి పూర్తి అవుతుంది. 28న బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలలో షేర్లు లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్ లో జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లకు దాదాపు 22 నుంచి 23 శాతం వరకు ప్రీమియం లభిస్తోంది. ఒక్కో షేర్ మీద రూ. 240 నుంచి రూ. 250 వరకు లాభాలతో లిస్ట్ అవ్వొచ్చని జీఎంపీ అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+