డిసెంబర్ లో బ్యాంకులకు వరుస సెలవులు

Bank holidays in December 2025: డిసెంబర్ లో బ్యాంకులకు వచ్చే సెలవుల జాబితా విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని విడుదల చేసింది. ప్రాంతీయ బ్యాంకు సెలవుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచింది. డిసెంబర్ లో బ్యాంకులకు మొత్తం 19 సెలవులు రానున్నాయి. ఒకరకంగా చూస్తే కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేసేది 10 రోజులే.

సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. డిసెంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు.

Mark Your Calendars December Bank Closures - Full List from RBI Inside

ఇవి పోను- ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం- షిల్లాంగ్, పనాజీ, గాంగ్‌టక్, ఐజ్వాల్, కోహిమా, ఇంఫాల్ వంటి నగరాల్లో క్రిస్మస్ తో పాటు మరికొన్ని రోజులు బ్యాంకులకు అదనంగా సెలవులు లభించాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల ద్వారా సేవలను పొందవచ్చు. చెక్కు క్లియరింగ్, ఇతర ఓవర్ ది కౌంటర్ సేవలు అందుబాటులో ఉండవు.

డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల వివరాలివీ..

డిసెంబర్ 1 సోమవారం: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం / ఇండిజినస్ ఫెయిత్ డే. ఈ రోజు ఇటానగర్, కోహిమాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

3, బుధవారం: ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. పనాజీలో మాత్రమే బ్యాంకులు పని చేయవు

12, శుక్రవారం: పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి.

18, గురువారం: యూ సోసో థామ్ వర్ధంతి

19, శుక్రవారం: గోవా విమోచన దినోత్సవం

20, శనివారం: లోసూంగ్ / నామ్‌సూంగ్ సెలబ్రేషన్స్.

22, సోమవారం: లోసూంగ్ / నామ్‌సూంగ్ సెలబ్రేషన్స్.

24, బుధవారం: క్రిస్మస్ ఈవ్ సెలవు

25, గురువారం: క్రిస్మస్ సెలవు.

26, శుక్రవారం: క్రిస్మస్ సెలబ్రేషన్స్

27, శనివారం: క్రిస్మస్ సెలబ్రేషన్స్

30, మంగళవారం: యూ కియాంగ్ నాంగ్‌బా వర్ధంతి

31, బుధవారం: న్యూ ఇయర్స్ ఈవ్

ఇవి కాకుండా- డిసెంబర్‌లో ఏడు ఆదివారాలు, శనివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 7- ఆదివారం, 13- శనివారం, 14- ఆదివారం, 21- ఆదివారం, 27- శనివారం, 28- ఆదివారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+