రూ. 65,614 వరకు పెరిగిన వెండి: చరిత్రలో తొలిసారిగా రూ. 3,00,000 మార్క్ క్రాస్

బంగారం, వెండి ధరల పతనం అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఈ రెండింటి ధరలు రోజురోజుకు రికార్డులను బద్దలు కొడుతూ కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే బిగ్ షాక్ ఇచ్చాయి. సోమవారం నాడు బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. పైపైకి దూసుకుపోయాయి. కిలో వెండి ధర మూడు లక్షల రూపాయల మార్కును దాటింది. వెండి అమ్మకాల చరిత్రలో ఇది మొదటిసారి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే కేజీ వెండి ధర అమాంతం 13,553 రూపాయల మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర ఆల్‌టైమ్ గరిష్టస్తాయిని అందుకుంది. కిలో వెండి 3,01,315 రూపాయలకు చేరుకుంది. గత శుక్రవారం MCX క్లోజింగ్ సమయానికి కేజీ వెండి ధర 2,87,762 రూపాయలు కాగా.. ఇప్పుడు ఓపెనింగ్ లోనే దీని ధర మూడు లక్షల రూపాయలను అధిగమించింది.

MCX Silver Clocks Rs 3 Lakh per Kg

గత ఏడాదిలో భారీ వృద్ధిని నమోదు చేసిన వెండి ధర.. ఈ సంవత్సరం జనవరిలో కూడా తన జోరును కొనసాగించింది. ఈ నెల ప్రారంభం నుండి ఇప్పటివరకు కిలో వెండి ధర ఏకంగా రూ. 65,614 పెరిగింది. డిసెంబర్ 31వ తేదీన కిలో వెండి ధర 2,35,701 రూపాయలు కాగా, ప్రస్తుతం అది 3,01,315 రూపాయలకు చేరింది. వెండితో పాటు బంగారం ధర కూడా భారీ వేగంతో కొత్త గరిష్ట స్థాయికి చేరింది. గత వారం శుక్రవారం ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 1,42,517 రూపాయల వద్ద ముగిసింది.

సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఇది 10 గ్రాములకు 1,45,500 రూపాయలకు చేరుకొని కొత్త రికార్డును నెలకొల్పింది. దీని ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 2,983 రూపాయలు పెరిగినట్టయింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలలో వచ్చిన పెరుగుదలను పరిశీలిస్తే డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,804 ఉండగా, ఇప్పటివరకు ఇది 10 గ్రాములకు 9,696 రూపాయలు పెరిగింది.

బంగారం, వెండి ధరలలో ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ విధించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ ప్రణాళికను అడ్డుకుంటున్న యూరోపియన్ దేశాలపై కూడా అమెరికా సుంకాలు విధించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండి వైపు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+