భారీగా పెరగనున్న పాల ధరలు.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ ఎంతో తెలుసా?

ఉదయాన్నే లేచి ఓ చుక్క టీ తాగదాం అనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు చక్కెర ధరలు మాత్రమే పైపైకి చూస్తున్నాయనుకున్న తరుణంలో ఇప్పుడు పాల ధరలు కూడా కొండెక్కబోతున్నాయి. వెరసి చిన్న పిల్లాడికి పట్టే పాల దగ్గర నుంచి మనం తాగే టీ, కాఫీ, మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి అన్ని డైరీ ఉత్పత్తులపై భారీ ప్రభావం పడబోతుంది!

ఆర్థిక రాజధాని ముంబైలో పాలు కొనుగోలు చేసే సామాన్యులకు సెప్టెంబర్ ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగలనుంది. డెయిరీ ఫారమ్‌ల నుంచి పాలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇకపై లీటరుకు రూ. 8 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీనితో ప్రస్తుతం ముంబయి మార్కెట్‌లో లీటరు రూ. 100 వరకు ఉన్న పాల ధర ఏకంగా రూ. 110 మార్కును తాకనుంది. పొద్దున్నే లేవగానే కాఫీ, టీలతో ముఖం కడిగే ముంబైవాలలకు ఈ ధరల మంట తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Mumbai Milk Prices to Surge From September 1 Retail Price Likely to Touch Rs 110 Per Litre After Hike
పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!
పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!

హోల్ సేల్ పెంపే అసలు కారణం

ఈ సడన్ బాంబుకు ప్రధాన కారణం 'ముంబై మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' తీసుకున్న నిర్ణయమే. డెయిరీ యజమానుల సమక్షంలో హోల్ సేల్ పాల ధరను లీటరుకు రూ. 93 నుంచి ఏకంగా రూ. 102 వరకు పెంచుతూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. హోల్ సేల్ మార్కెట్లోనే లీటరుపై రూ. 9 పెరగడంతో, అది చివరికి రీటైల్ వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేలా లీటరు రూ. 110కి చేరనుంది. ఈ నిర్ణయం ముంబైలోని లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది.

పశువుల దాణా ధరలకు రెక్కలు!

ధరల పెంపు నిర్ణయాన్ని డెయిరీ నిర్వాహకులు గట్టిగా సమర్థించుకుంటున్నారు. పశువుల పోషణ, రోజువారీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా పశువుల దాణాగా వాడే ధాన్యాలు, కంది - శనగ పొట్టు ధరలు గత కొన్ని నెలల్లోనే దాదాపు 25 శాతం వరకు పెరిగాయి. దీనికి తోడు దాణా, తౌడు, పశువైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరగడంతో, వేరే దారి లేకనే పాల ధరలను పెంచక తప్పలేదని పశుపోషకులు చెబుతున్నారు.

షాంపులతో పాలు, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం షాకింగ్ నిజాలు!
షాంపులతో పాలు, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం షాకింగ్ నిజాలు!

హాట్ స్వీట్లు.. ప్రియమైన లస్సీలు!

పాలు ప్రియం కానుండటంతో దాని ఆధారిత ఉత్పత్తులన్నీ ప్రియం కానున్నాయి. లస్సీ, మజ్జిగ, నెయ్యి, వెన్న, పనీర్ నుంచి మొదలుకొని రాబోయే పండుగల సీజన్ కోసం తయారుచేసే రకరకాల స్వీట్స్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముంది. ముడిసరుకైన పాల ధర పెరిగినందున ఉత్పత్తుల రేట్లను సవరించక తప్పదని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి రానుండటంతో సామాన్య గృహిణులతో పాటు హోటల్, కేఫ్ నిర్వాహకులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+