వాహనదారులకు భారీ ఉపశమనం?
గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్‌లలో తీవ్ర అస్థిరత నెలకొన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయని సూచించింది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న సంఘర్షణ కారణంగా ఇటీవల ప్రపంచ ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ సంక్షోభం హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదంపై ఆందోళనలను రేకెత్తించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ కీలక మార్గం గుండానే సాగుతుంది. దీని ప్రభావంతో ఈ వార ప్రారంభంలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది.

యుద్ధం విరమిస్తాంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత ముడిచమురు రేట్లు తగ్గడం కొంత ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 99.48 డాలర్లు పలుకుతోంది. అటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లోనూ ముడిచమురు ధర తగ్గింది. 91.27 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications