Tax: తక్కువ పన్ను కట్టే ట్రిక్ ఇదే. ఏ పన్ను విధానం మీకు లాభం?

నేటి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వేళ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయ వర్గాలను ఆకట్టుకునేలా 'కొత్త పన్ను విధానాన్ని' (New Tax Regime) మరింత సరళీకరించింది. ఇకపై రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. జీతగాళ్లకు ఇచ్చే రూ. 75,000 ప్రామాణిక మినహాయింపును (Standard Deduction) కూడా కలిపితే, ఏకంగా రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై 'సున్నా' పన్ను వర్తిస్తుంది.

కొత్త పన్ను విధానంలో ప్రవేశపెట్టిన 'మార్జినల్ రిలీఫ్' అనేది పన్ను చెల్లింపుదారులకు ఒక రక్షణ కవచం లాంటిది. సాధారణంగా మీ ఆదాయం పరిమితి కంటే కొంచెం పెరిగినా పన్ను భారం భారీగా పెరుగుతుంది. కానీ ఈ మార్జినల్ రిలీఫ్ వల్ల, మీ ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎంత అదనంగా పెరిగిందో, పన్ను కూడా ఆ పెరిగిన మొత్తానికి మించకుండా ఉంటుంది.

Old vs New Tax Regime Which One Saves More Money for Salaried Employees with Rs 12 Lakh Plus Income

ఉదాహరణకు: మీ పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 12.35 లక్షలు అనుకుందాం. పాత లెక్కల ప్రకారం పన్ను రూ. 65,250 వచ్చేది. కానీ మార్జినల్ రిలీఫ్ పుణ్యమా అని ఆ పన్ను ఇప్పుడు కేవలం రూ. 35,000కే పరిమితమవుతుంది. అంటే ఆదాయం పెరిగినంత వేగంగా పన్ను భారం పెరగదు.

పాత పద్ధతి Vs కొత్త పద్ధతి: ఏది ఎంచుకోవాలి?

పన్ను ఆదా విషయంలో 'అందరికీ ఒకే సూత్రం' వర్తించదు. మీ పెట్టుబడులు, ఖర్చుల ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోవాలి.

కొత్త విధానం ఎవరికి మేలు?:

మీరు ఇన్వెస్ట్‌మెంట్లతో పని లేకుండా, తక్కువ శ్రమతో ఎక్కువ పన్ను ఆదా చేయాలనుకుంటే ఇది ఉత్తమం. ఇందులో సెక్షన్ 80C, హెచ్‌ఆర్‌ఏ (HRA) వంటి మినహాయింపులు ఉండవు కానీ, రూ. 12.75 లక్షల వరకు భారీ మినహాయింపు లభిస్తుంది. పొదుపు పథకాల్లో డబ్బును లాక్ చేయకూడదు అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

పాత విధానం ఎప్పుడు లాభం?:

మీరు క్రమం తప్పకుండా ఎల్‌ఐసీ (LIC), పీపీఎఫ్ (PPF) వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇంటి అద్దె చెల్లిస్తున్నా లేదా హోమ్ లోన్ ఈఎంఐలు కడుతున్నా పాత విధానం మీకు లాభదాయకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు కూడా సరైన ప్లానింగ్‌తో అన్ని మినహాయింపులు వాడుకుంటే పాత పద్ధతిలో 'సున్నా' పన్నుకు చేరుకోవచ్చు.

ఆర్థిక ప్రణాళికే కీలకం

కొత్త విధానం రూ. 12 లక్షల వరకు సులభమైన ఉపశమనాన్ని ఇస్తుంటే, పాత విధానం దాదాపు రూ. 3.24 లక్షల వరకు వివిధ ఫ్లెక్సీ ప్రయోజనాలను అందిస్తోంది. మీ జీవనశైలికి తగినట్లుగా, మీరు ఎంత ఆదాయాన్ని మినహాయింపుల కింద చూపించగలరో లెక్కలేసుకుని ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం తెలివైన పని. పన్ను కట్టడం కంటే పన్ను ప్రణాళిక ముఖ్యం అని గుర్తించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+