Post Office : రూ. లక్షకు రూ.44 వేలు వడ్డీ. బ్యాంకులకు దిమ్మతిరిగే షాక్
గత ఏడాదిన్నర కాలంగా మ్యూచువల్ ఫండ్ (SIP)లలో పెట్టుబడి పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లకు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. కొన్ని స్కీములు వాటి ద్వారా వచ్చే లాభాల సంగతి పక్కనపెడితే.. పూర్తిగా నష్టాల బాట పట్టారు కూడా. దీంతో చాలా మందిలో రిస్క్ భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే న పెట్టుబడిదారులు ఇప్పుడు స్థిరమైన, గ్యారెంటీ రాబడులు ఇచ్చే పెట్టుబడుల వైపు మళ్లీ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్టాఫీసు మంచి స్కీమ్ తో మన ముందుకు వచ్చింది.
రిస్క్ వద్దు, పెట్టుబడికి భద్రతే ముద్దు అనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఛాయిస్. ఈ స్కీమ్‌లో పెట్టుబడి కాలాన్ని ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందరికి ఫిక్సిడ్ డిపాజిట్లు(FD) లు, PPF, రికరింగ్ డిపాజిట్లు (RD)లు, సుకన్య సమృద్ధి యోజనతో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లపై ఆసక్తి గణనీయంగా పెరిగింది.
ముఖ్యంగా ప్రభుత్వ భరోసా ఉండటంతో, మధ్యతరగతి కుటుంబాలు పోస్ట్ ఆఫీస్ పెట్టుబడులను సురక్షిత మార్గంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌పై కల్పిస్తున్న వడ్డీ రేట్లు ఒకసారి చూద్దాం.. 1 సంవత్సరం పెట్టుబడికి 6.9%, 2 సంవత్సరాలకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, 5 సంవత్సరాలకు గరిష్ఠంగా 7.5% వడ్డీ అందుతోంది.

దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి..
ఉదాహరణకు, మీరు రూ.1 లక్షను 5 సంవత్సరాల పాటు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి మొత్తం రూ.1,44,995 వస్తాయి. అంటే దాదాపు రూ.44,995 వడ్డీ రూపంలో లాభం లభిస్తుంది. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే ఇందులో వెసులుబాటు కూడా ఉంది. టైం పిరియడ్ ఐదేళ్లకు కాకుండా.. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లకు కూడా పెట్టుబడులు పెట్టేలా మంచి సౌకర్యం అందుబాటులో ఉంది.
బ్యాంక్ FDలతో పోలిస్తే..
ఇప్పటికే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అదే సమయంలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వ హామీ ఉండటం వల్ల, పెట్టుబడిదారులు ఈ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు.
పెట్టుబడి ఎలా? ఎవరికీ అనుకూలం?
ఈ స్కీమ్‌లో పెట్టుబడిని రూ.1,000తోనే ప్రారంభించవచ్చు. సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా సులభంగా ఖాతా తీసుకొవచ్చు. చిన్న పిల్లల పేరుతోనూ, వృద్ధుల పేరుతోనూ ఖాతాలు తెరవడానికి అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే, మార్కెట్ ఊగిసలాటలతో ఇబ్బంది పడకుండా, నిశ్చింతగా పెట్టుబడి పెట్టి స్థిర లాభాలు పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఈ సమయంలో మంచి ఆఫ్షన్ గా చెప్పవచ్చు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications