లిక్కర్ ఫుల్ బాటిల్ 750 ml మాత్రమే ఉండడానికి కారణం అదే..!
భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తున్న విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. అయితే మీరు "ఫుల్ బాటిల్" లను గమనిస్తే 750 మి.లీ అనేది స్టాండర్డ్ సైజు. బీరు, వైన్, విస్కీ, వోడ్కా, రమ్.. దాదాపు అన్ని మద్యం బ్రాండ్లు ఈ పరిమాణంలోనే బాటిల్స్‌ను విడుదల చేస్తాయి. ఈ పరిమాణంలోనే ఎందుకు లభిస్తోందనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అందుకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ఫ్రెంచ్ వైన్ చరిత్ర..
750 మి.లీ బాటిల్ చరిత్ర ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ వైన్ తయారీదారులు, డైనింగ్ కల్చర్‌ను దృష్టిలో పెట్టుకుని బాటిల్ పరిమాణాన్ని నిర్ణయించారు. సాధారణంగా భోజన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆరు పెగ్‌ల వైన్ తాగేవారు. ఒక్కో పెగ్ దాదాపు 60-65 మి.లీ ఉంటే మొత్తం 12 పెగ్‌లు సుమారు 720 మి.లీ అవుతాయి. ఆ తర్వాత కొద్దిగా అదనంగా ఉంచి.. ఇద్దరికీ సరిపడే విధంగా ఉంటుందని భావించి 750 మి.లీని ఫిక్స్ చేశారు.

అలానే అమెరికాలో లీటర్లు కాకుండా గ్యాలన్లలో ద్రవాలను కొలుస్తారు. ఒక గ్యాలన్ = 3.785 లీటర్లు. దీన్ని 5 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగం 757 మి.లీ వస్తుంది. ఆ విధంగా 750 మి.లీని అంతర్జాతీయ ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే అమెరికా, యూరప్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఈ కొలతను అనుసరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ అనేక బ్రాండ్లు 500 మి.లీ, 1 లీటర్ లేదా మినీ బాటిల్స్ విడుదల చేస్తున్నప్పటికీ, 750 మి.లీ "ఫుల్ బాటిల్"గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా బాటిల్ పరిమాణాలు..
అమెరికా..
మినీ బాటిల్ (Miniature) - 50 ml (ఒక షాట్‌కు సరిపడే పరిమాణం).
హాఫ్ పింట్ - 200 ml.
పింట్ - 375 ml.
ఫిఫ్త్ (Fifth) - 750 ml (ప్రధానంగా ఉపయోగించే ఫుల్ బాటిల్ సైజు).
లీటర్ - 1 L (కొన్ని బ్రాండ్లు ఈ సైజు లో అందిస్తాయి).
హ్యాండిల్ - 1.75 L (పెద్ద పార్టీల కోసం).
యూరప్..
స్టాండర్డ్ వైన్ బాటిల్ - 750 ml.
హాఫ్ బాటిల్ - 375 ml.
మాగ్నమ్ బాటిల్ - 1.5 L (ప్రత్యేక ఈవెంట్స్, వేడుకలలో).
జెరోబోమ్ (Jeroboam) - 3 L (4 వైన్ బాటిల్స్ సమానం).
మెథూసెలా (Methuselah) - 6 L (ప్రెస్టీజియస్ ఫంక్షన్లలో మాత్రమే).
జపాన్..
సేకే (Sake) కోసం 720 ml బాటిల్ స్టాండర్డ్‌గా ఉంటుంది.
ఇతర పరిమాణాలు: 300 ml, 1.8 L కూడా సేకే కోసం వస్తాయి.
భారత్..
క్వార్టర్ (Quarter) - 180 ml.
హాఫ్ (Half) - 375 ml.
ఫుల్ బాటిల్ (Full Bottle) - 750 ml.
మినీ బాటిల్స్ - 90 ml (కొన్ని బ్రాండ్లలో మాత్రమే).
వైన్, ప్రీమియం లిక్కర్‌కు 1 L బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆస్ట్రేలియా & న్యూజీలాండ్..
వైన్, స్పిరిట్స్ కోసం 750 ml బాటిల్ ప్రామాణిక పరిమాణం.
Magnum (1.5 L), Half Bottles (375 ml) కూడా మార్కెట్లో ఉంటాయి.












Click it and Unblock the Notifications