వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

550కోట్లు చెల్లించాలి! అనిల్ అంబానీని దేశం విడిచివెళ్లనీయొద్దు: సుప్రీంలో ఎరిక్‌సన్ పిటిషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనిల్‌ అంబానీని కష్టాలు వీడటం లేదు. తాజాగా అనిల్ అంబానీతో పాటు రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన మరో ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు దేశం వదలివెళ్లకుండా చూడాలని స్వీడన్‌ టెలికాం కంపెనీ ఎరిక్‌సన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతక్రితం హామీ ఇచ్చిన విధంగా రూ.550 కోట్లను చెల్లించకుండా వారు ఎగవేస్తారేమోనని సదరు కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.

రూ. 550కోట్లు చెల్లించాలి కానీ..

రూ. 550కోట్లు చెల్లించాలి కానీ..

కాగా, అంతకుముందు కోర్టు ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అంబానీ గ్రూప్‌ చెల్లించాల్సిన రూ.1600 కోట్ల బకాయిలను రూ.550 కోట్లకు తగ్గించుకుంది. అదే సమయంలో ఈ ఏడాది సెప్టెంబరు 30 కల్లా చెల్లించేలా హామీ తీసుకుంది. అయితే ఆర్‌కామ్‌ నుంచి ఎటువంటి చెల్లింపులు రాకపోవడంతో మరోసారి సుప్రీం కోర్టు గడప తొక్కాలని ఎరిక్‌సన్‌ నిర్ణయం తీసుకుంది.

 అనిల్ అంబానీని దేశం వదిలివెళ్లకుండా..

అనిల్ అంబానీని దేశం వదిలివెళ్లకుండా..


‘చట్ట ప్రక్రియలను వారు ఉల్లంఘిస్తున్నారు. దేశ చట్టాలకు వారు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదు. అందుకే కోర్టు ధిక్కరణ కింద ఆ కంపెనీ, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, దేశం వదిలి వెళ్లకుండా చూడాలని కోరుతున్నాం' అని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎరిక్‌సన్‌ పేర్కొంది.

60రోజుల గడువు కోరిన ఆర్‌కామ్

60రోజుల గడువు కోరిన ఆర్‌కామ్

అయితే, ఎరిక్‌సన్‌ బకాయిల విషయంలో మరో 60 రోజుల గడువు కోరుతూ సుప్రీం కోర్టులో సెప్టెంబరు 28న దరఖాస్తు చేసినట్లు కూడా ఆర్‌కామ్‌ స్పష్టం చేసింది. దీనిపై గురువారం (అక్టోబరు 4న' విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎరిక్‌సన్‌ తాజా పిటిషన్‌ ‘అసమంజసం' అని తెలిపింది.

మరోవైపు ఆర్ కామ్‌కు ఊరట

మరోవైపు ఆర్ కామ్‌కు ఊరట


ఇది ఇలావుంటే, టెలికాం ట్రైబ్యునల్‌ నుంచి ఊరట లభించినట్లు ఆర్‌కామ్‌ బుధవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత స్పెక్ట్రమ్‌ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. వాటి ద్వారా వచ్చిన నిధులను ఎరిక్‌సన్‌ ఇండియా, ఆర్‌ఐటీఎల్‌ మైనారిటీ వాటాదార్లకు చెల్లింపులు చేస్తామని వివరించింది. ‘స్పెక్ట్రమ్‌ విక్రయం ద్వారా రూ.975 కోట్లు పొందుతాం. ఇందులో రూ.550 కోట్లను ఎరిక్‌సన్‌కు; రూ.230 కోట్లను రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ (ఆర్‌ఐటీఎల్‌)కు చెల్లిస్తాం' అని బుధవారం బీఎస్‌ఈకిచ్చిన సమాచారంలో ఆర్‌కామ్‌ వల్లడించింది.
‘టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్‌) కోరిన బ్యాంకు హామీ రూ.2900 కోట్లపై అక్టోబరు 1, 2018న వెలువరిచిన మధ్యంతర ఉత్తర్వుల్లో టెలికాం వివాదాల పరిష్కారాల అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌(టీడీశాట్‌) స్టే ఆర్డరు ఇచ్చింది. దీంతో ఆర్‌కామ్ కు ఊరట లభించినట్లయింది.

English summary
The Supreme Court is likely to hear on Thursday telecom equipment maker Ericsson's plea seeking contempt action against RCom Chairman Anil Ambani and others for failing to pay Rs 550 crore towards the settlement to the company by September end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X