సెప్టెంబర్‌లో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులు బంద్..!
ప్రజలకు ఒక ముఖ్యమైన అలర్ట్. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 15 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో వెల్లడించింది. బ్యాంకు పనుల కోసం తరచూ బ్రాంచీలకు వెళ్లేవారు ఈ విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది.
అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల కారణంగా మొత్తం 9 రోజులను ఆర్బీఐ సెలవులుగా ప్రకటించింది. వీటికి అదనంగా ఆరు వారాంతపు సెలవులు (నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు) ఉన్నాయి. దీంతో మొత్తం సెలవుల సంఖ్య 15 కు చేరింది. ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 5న (శుక్రవారం) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వారాంతపు సెలవులు విషయానికి వస్తే..
సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు.. సెప్టెంబర్ 13 (రెండో శనివారం), సెప్టెంబర్ 27 (నాలుగో శనివారం) ఉన్నాయి.
సెలవుల లిస్ట్..
3 సెప్టెంబర్ 2025 (బుధవారం) : కర్మ పూజ రోజున జార్ఖండ్, రాంచీలో బ్యాంకులకు సెలవులు
4 సెప్టెంబర్ 2025 (గురువారం) : కేరళలోని మొదటి ఓనం, తిరువనంతపురం, కొచ్చిలో సెలవులు
5 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) : ఈద్-ఎ-మిలాద్ / మిలాద్-ఉన్-నబి అనేక రాష్ట్రాలు
6 సెప్టెంబర్ 2025 (శనివారం) : ఈద్-ఎ-మిలాద్ గాంగ్టక్, రాయ్‌పూర్
7 సెప్టెంబర్ 2025 (ఆదివారం) : వీక్లీ హాలిడే (ఆల్ ఇండియా)
12 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) : ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవులు
13 సెప్టెంబర్ 2025 (శనివారం) : రెండో శనివారం దేశమంతటా సెలవు
14 సెప్టెంబర్ 2025 (ఆదివారం) : వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
21 సెప్టెంబర్ 2025 (ఆదివారం) : వీకెండ్ హాలిడే సెలవు (ఆల్ ఇండియా)
22 సెప్టెంబర్ 2025 (సోమవారం) : నవరాత్రి రోజున జైపూర్‌లో బ్యాంకులకు సెలవులు
23 సెప్టెంబర్ 2025 (మంగళవారం) : మహారాజా హరి సింగ్ జయంతి జమ్మూ, శ్రీనగర్‌లో సెలవులు
27 సెప్టెంబర్ 2025 (శనివారం) : నాల్గో శనివారం (ఆల్ ఇండియా)
28 సెప్టెంబర్ 2025 ( ఆదివారం ) : వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
29 సెప్టెంబర్ 2025 (సోమవారం) : మహా సప్తమి/దుర్గా పూజ అగర్తల, గౌహతి, కోల్‌కతా
30 సెప్టెంబర్ 2025 (మంగళవారం) : మహా అష్టమి/దుర్గా పూజ అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో హాలీడే
అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. నగదు లావాదేవీలు లేదా బ్రాంచీకి తప్పనిసరిగా
వెళ్లాల్సిన పనులు ఉంటే.. ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications