Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Idea: రూ.లక్ష పెట్టుబడి పెడితే చాలు.. లక్షల్లో లాభం మీ సొంతం?

Business Idea: దేశంలో లక్షలాది రకాల వ్యాపారాలు ఉన్నాయి. అన్నీ నడుస్తున్నాయి. కానీ అన్ని రకాల వ్యాపారాలు అందరూ చేయలేరు. వ్యాపారం చేయడానికి అనుభవంతో పాటు పెట్టుబడి కూడా అవసంరం. అయితే మీరు ఒక వారం శిక్షణతో, తక్కువ పెట్టుబడితో రెట్టింపు లేదా మూడు రెట్లు సంపాదించగల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. అదే చెప్పుల తయారీ వ్యాపారం.

చెప్పుల తయారీ వ్యాపారం అనే దేశంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు సంపాదించగల బిజినెస్. చెప్పులు అనేవి చిన్ననాటి నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమే. ఈ కాలంలో ప్రతి వ్యక్తికి అనేక రకాల చెప్పులు ఉన్నాయి. ఇంట్లో ధరించడానికి ఒకటి, మార్కెట్‌కు వెళ్లడానికి మరొకటి, చలికాలానికి ఒకటి, వేసవికి ఒకటి.. ఇలా చాలా రకాల చెప్పులు వాడుతారు. కాబట్టి అన్ని వయస్సుల వారిలో ఇది వినియోగదారులను కలిగి ఉంటుంది. ఇది 12 నెలలు నడిచే వ్యాపారం.

Slipper Manufacturing Business with Low Investment Start with Rs 1 Lakh and Earn Big Profits Monthly

ఇప్పుడు చిన్నపాటి చెప్పుల ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత సంపాదించవచ్చు? వాస్తవానికి నేటి చెప్పుల మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి, అయితే ఈ కంపెనీలు కూడా చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా, మీరు ఈ వ్యాపార యూనిట్‌ను నగరం లేదా గ్రామం, ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే స్లిప్పర్‌లకు అన్ని చోట్లా ఒకే రకమైన డిమాండ్ ఉంటుంది.

చెప్పుల తయారీని ఎలా ప్రారంభించాలి?
మీరు చెప్పుల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రారంభంలో మాన్యువల్ లేదా సెమీ-ఆటోమేటిక్ యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు కనీసం 5 రకాల యంత్రాలను ఏర్పాటు చేయాలి. స్లిప్పర్ షీట్‌ను తయారు చేయడం నుంచి కటింగ్, డ్రిల్లింగ్, గ్రైండింగ్, డిజైనింగ్, ప్రింటింగ్, స్ట్రాప్ ఫిట్టింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలి. ప్రారంభంలో మీరు స్లిప్పర్ షీట్ యంత్రాన్ని ఏర్పాటు చేయకూడదనుకుంటే, దేశంలో అనేక మంది తయారీదారులు ఉన్నారు. వారి నుండి మీరు స్లిప్పర్ షీట్లను కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే స్లిప్పర్ షీట్ యంత్రం ధర చాలా ఎక్కువ.

చెప్పుల తయారీ వ్యాపారానికి ఎంత ఖర్చవుతుంది.. ఎంత సంపాదించవచ్చు?
ఒక చిన్న స్లిప్పర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసినా.. ఒక జత చెప్పులు తయారు చేయడానికి రూ.35 నుంచి రూ.40 ఖర్చవుతుంది. కొందరు చెప్పుల తయారీదారులు జతకు కేవలం రూ.25-రూ.27 ఖర్చవుతుందని తెలిపారు. అదే చెప్పులు రిటైల్ మార్కెట్‌లో రూ.120-రూ.150కి అమ్ముడవుతాయి. చాలా వారపు మార్కెట్లలో, చిన్న దుకాణాలలో ఇదే చెప్పులు లభిస్తాయి. ఇవి పెద్ద బ్రాండ్లు కానప్పటికీ ఫినిషింగ్, చూసేందుకు మంచి బ్రాండ్లతో పోటీ పడతాయి. హోల్‌సేల్‌లో ఇదే స్లిప్పర్ జత రూ.60 నుంచి రూ.70 వరకు సులభంగా అమ్ముడవుతుంది.

చెప్పుల తయారీ షీట్
మీరు స్లిప్పర్ షీట్లను కొనుగోలు చేసి చెప్పులు తయారు చేస్తే, ఒక షీట్ నుంచి 25 జతల స్లిప్పర్‌లు తయారు చేయబడతాయి. ఒక జతపై రూ.20 లాభం లెక్కించినట్లయితే, ఒక చిన్న యంత్రంతో రోజుకు కనీసం 200 నుండి 300 జతల చెప్పులు తయారు చేయవచ్చు. అంటే రోజుకు రూ.4000 నుండి రూ.6000 లాభం. ఈ వ్యాపారం నుండి నెలకు రూ.1 లక్ష నికరంగా సంపాదించవచ్చు. అదే ఆటోమేటిక్ యంత్రంతో 8 గంటల్లో 1500-2000 జతల చెప్పులు తయారు చేయబడతాయి. ఈ యంత్రంపై 5 సంవత్సరాల గ్యారెంటీ ఇవ్వబడుతుంది.

చెప్పులు తయారు చేయడానికి 4 నుంచి 5 రకాల యంత్రాలు అవసరం అని మనం చర్చించుకున్నాం. కటింగ్, డ్రిల్లింగ్, గ్రైండింగ్, డిజైనింగ్, ఎంబోసింగ్ (ప్రింటింగ్), స్ట్రాప్ ఫిట్టింగ్.

ఖర్చు: చెప్పుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చిన్న స్థాయిలో రూ.20,000 నుంచి రూ.1 లక్ష వరకు, మధ్యస్థ స్థాయిలో రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద స్థాయిలో రూ.6 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు.

ముడిసరుకు: రబ్బరు, పీవీసీ, ఫోమ్, ప్యాకేజింగ్ మెటీరియల్. ఈ వస్తువులు మీకు హోల్‌సేల్‌లో సులభంగా లభిస్తాయి. యూట్యూబ్, ఇండియా మార్ట్‌లో దీని పూర్తి సమాచారం లభిస్తుంది.

యంత్రం ధర ఎంత?
*మాన్యువల్ సోల్ కటింగ్ మెషిన్: రూ.10,000-రూ.20,000లో.

*ఆటోమేటిక్ చెప్పులు తయారు చేసే మెషిన్: రూ.1-రూ.2.5 లక్షలలో.

*ప్రింటింగ్, ఫినిషింగ్ మెషిన్: రూ.20,000-రూ.50,000లో.

*మొత్తం యంత్రాల ఖర్చు: రూ.40,000-రూ.2 లక్షలలో.

చెప్పులు ఎలా తయారు చేస్తారు?
మొదట సోల్ కటింగ్ అంటే రబ్బరు లేదా పీవీసీ షీట్‌ను చెప్పుల ఆకారంలో కత్తిరిస్తారు. తర్వాత ఫినిషింగ్ కోసం అంచులను నునుపుగా చేస్తారు, ఆ తర్వాత చెప్పుపై డిజైన్ లేదా లోగో ప్రింట్ చేస్తారు. తర్వాత చెప్పులో రబ్బరు, తోలు లేదా వస్త్ర పట్టీలు అమర్చుతారు. చివరగా, అద్భుతమైన ప్యాకేజింగ్‌తో చెప్పులను ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు.

చెప్పులను ఎలా విక్రయించవచ్చు?
మీరు నేరుగా హోల్‌సేల్ వ్యాపారులను సంప్రదించవచ్చు, దీనితో పాటు ఈ వ్యాపారాన్ని రిటైల్‌లో కూడా చేయవచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి) లేదా సోషల్ మీడియా ద్వారా కూడా కస్టమర్‌లను చేరుకోవచ్చు.

ఉత్పత్తికి ముందు రీసెర్చ్
చెప్పులు తయారు చేయడానికి ముందు స్థానిక దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఏ రకం చెప్పులకు ఎక్కువ డిమాండ్ ఉందో సమాచారం సేకరించండి. ఆపై అలాంటి రకం చెప్పులపై దృష్టి పెట్టండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చౌకైన చెప్పులు ఎక్కువగా అమ్ముడవుతాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో ఫ్యాషనబుల్, బ్రాండెడ్ చెప్పులు ప్రాధాన్యతనిస్తాయి. మంచి ప్యాకేజింగ్ కస్టమర్లను ఆకర్షించడంతో పాటు బ్రాండ్ విలువను పెంచుతుంది. చెప్పుల తయారీకి శిక్షణను ఖాదీ గ్రామోద్యోగ్ (kvic.org.in) లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి తీసుకోవచ్చు. ముద్ర లోన్ లేదా పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి రోజ్‌గార్ సృజన్ కార్యక్రమ్) వంటి ప్రభుత్వ పథకాల కింద రుణాలు పొందవచ్చు. మీరు స్వయంగా చెప్పులు తయారు చేస్తే, ఖర్చు తక్కువగా ఉంటుంది. లాభం 50 శాతం వరకు ఉండవచ్చు. మీరు హోల్‌సేలర్‌కు 15 నుండి 20శాతం లాభంపై ఉత్పత్తులను అందించవచ్చు.

*చిన్నతరహా ఫ్యాక్టరీ

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 500-1,000 జతల చెప్పులు.
పెట్టుబడి: రూ.50,000-రూ.1.5 లక్షలు.
మాన్యువల్ సోల్ కటింగ్ మెషిన్: రూ.10,000-రూ.20,000లో.
ప్రింటింగ్, ఫినిషింగ్ మెషిన్: రూ.20,000-రూ. 50,000లో.

దీని కోసం మీరు స్లిప్పర్ షీట్‌ను బయట నుండి కొనుగోలు చేయాలి.

*మధ్యస్థ స్థాయి ఫ్యాక్టరీ

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 1,000-3,000 జతల చెప్పులు.
పెట్టుబడి: రూ.2-రూ.5 లక్షలు.
ఆటోమేటిక్ సోల్ కటింగ్ మెషిన్: రూ.50,000-రూ.1 లక్షలో.
ఆటోమేటిక్ చెప్పులు తయారు చేసే మెషిన్: రూ.1-రూ.2 లక్షలలో.
ప్రింటింగ్ మెషిన్ (డిజైన్ కోసం): రూ.20,000-రూ.50,000లో.
మొత్తం యంత్రాల ఖర్చు: రూ.1.5-రూ.3 లక్షలు.
జతకు ఖర్చు: రూ.24-రూ.30 (హవాయి, డిజైనర్ చెప్పులు).

*పెద్ద స్థాయి ఫ్యాక్టరీ

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 5,000-10,000 జతల చెప్పులు.
పెట్టుబడి: రూ.10-రూ.20 లక్షలు.
పూర్తిగా ఆటోమేటిక్ చెప్పుల ఉత్పత్తి లైన్: రూ.5-రూ.10 లక్షలలో.
హైటెక్ ప్రింటింగ్, ఫినిషింగ్ మెషిన్: రూ.1-రూ.2 లక్షలలో.
మొత్తం యంత్రాల ఖర్చు: రూ.6-రూ.12 లక్షలు.
ముడిసరుకు: ప్రారంభ స్టాక్ (5,000-10,000 జతల): రూ.1-రూ.3 లక్షలలో.
ఉద్యోగులు: 10-20 మంది ఉద్యోగులు (సగటు జీతం రూ.15-20 వేలు) సుమారు రూ.1.50 లక్షలు/నెల.
లాభం ఉత్పత్తి ఖర్చు, అమ్మకపు ధర, అమ్మకపు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

మీరు మధ్యస్థ స్థాయి ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే, వ్యాపారం పెరుగుతుంది. లాభం కూడా పెరుగుతుంది.మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేస్తే, లాభం ఎక్కువగా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+