సోనీ షాకింగ్ నిర్ణయం.. టీవీల వ్యాపారం చైనా కంపెనీకి అప్పగింత

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ తన టెలివిజన్ వ్యాపారంలో ఓ చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ప్రీమియం టీవీల రంగంలో అగ్రగామిగా ఉన్న సోనీ.. తన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 51 శాతం మెజారిటీ వాటాను చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ (TCL) కు విక్రయించేందుకు మంగళవారం (జనవరి 20) ఒప్పందం కుదుర్చుకుంది.

సోనీ, టీసీఎల్ కంపెనీలు కలిసి ఓ సరికొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ప్రకారం వ్యాపార నిర్వహణ బాధ్యతల్లో 51 శాతం వాటా టీసీఎల్ వద్ద ఉండగా.. మిగిలిన 49 శాతం సోనీ వద్ద ఉంటుంది. ఈ కొత్త సంస్థ 2027 ఏప్రిల్ నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. అయితే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చే టీవీలు ఇప్పటిలాగే Sony, BRAVIA బ్రాండింగ్‌తోనే వస్తాయి. ప్రొడక్ట్ డిజైన్, సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి అంశాలను ఈ కొత్త జాయింట్ వెంచర్ పర్యవేక్షిస్తుంది.

Sony Hands Over TV Business to China TCL 51 Stake Sold in Major Strategic Shift

సోనీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
సోనీ తన మెజారిటీ వాటాను విక్రయించడానికి ప్రధానంగా పెరిగిన పోటీ, మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలు కారణమని తెలుస్తోంది. శాంసంగ్, ఎల్‌జీ వంటి కంపెనీలతో పాటు చైనాకు చెందిన హైసెన్స్, టీసీఎల్ వంటి సంస్థలు తక్కువ ధరకే నాణ్యమైన టీవీలను అందిస్తుండటంతో సోనీ లాభాల శాతం గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు సోనీ ప్రస్తుతం కేవలం హార్డ్‌వేర్ తయారీపై కాకుండా.. ప్లేస్టేషన్, సినిమాలు, సంగీతం, ఇమేజ్ సెన్సార్ల వంటి అధిక లాభాలు వచ్చే విభాగాలపై ఎక్కువ దృష్టి సారించాలని భావిస్తోంది. టీసీఎల్‌కు సొంతంగా డిస్‌ప్లే ప్యానెల్ ఫ్యాక్టరీలు ఉండటం వల్ల, వాటి ద్వారా టీవీలను తయారు చేయిస్తే సోనీకి ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గుతాయి.

వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో సోనీ బ్రావియా టీవీ కొనుగోలు చేసే వారికి కొన్ని సానుకూల మార్పులు ఎదురుకావచ్చు. టీసీఎల్ భారీ తయారీ సామర్థ్యం కారణంగా సోనీ టీవీల ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే, టీవీ డిస్‌ప్లే ప్యానెల్స్ టీసీఎల్ తయారు చేసినప్పటికీ, సోనీకి పేరు తెచ్చిన ప్రఖ్యాత ప్రాసెసర్, ఆడియో టెక్నాలజీలను సోనీయే అందిస్తుంది. దీనివల్ల పిక్చర్, సౌండ్ క్వాలిటీలో సోనీ మార్క్ అనుభూతి అలాగే ఉంటుంది. అలాగే ఇప్పటివరకు కేవలం ప్రీమియం విభాగంకే పరిమితమైన సోనీ.. టీసీఎల్ సహకారంతో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే బడ్జెట్ రేంజ్ స్మార్ట్ టీవీలను కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురావచ్చు.

జపనీస్ ఆధిపత్యానికి తెరపడిందా?
ఒకప్పుడు ప్రపంచ టీవీ మార్కెట్‌ను ఏలిన జపాన్ కంపెనీలైన తోషిబా, హిటాచీ, పానాసోనిక్ వంటివి ఇప్పటికే ఈ రంగం నుండి తప్పుకున్నాయి లేదా ఇతర కంపెనీలతో చేతులు కలిపాయి. ఇప్పుడు సోనీ కూడా అదే బాటలో పయనిస్తూ.. చైనా భాగస్వామ్యంతో తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఇది జపాన్ ఎలక్ట్రానిక్స్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టిందనడానికి ఒక సంకేతం కావొచ్చు, కానీ సోనీ వంటి బ్రాండ్‌ను అంతర్జాతీయ మార్కెట్లో సుస్థిరంగా ఉంచడానికి ఇది ఒక అనివార్యమైన, తెలివైన నిర్ణయంగా నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+