బడ్జెట్ బాద్‌షా.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది!
Tata Punch Facelift SUV: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మోస్ట్ పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో ఘనంగా విడుదల చేసింది. మరింత బోల్డ్ లుక్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ కొత్త పంచ్ ప్రారంభ ధరను రూ.5.59 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
నెక్సాన్‌ను తలపించే సరికొత్త డిజైన్
కొత్త టాటా పంచ్ డిజైన్ ఇప్పుడు టాటా ప్రీమియం ఎస్‌యూవీలైన నెక్సాన్, హారియర్, సఫారీలను పోలి ఉంది. ముందు భాగంలో కొత్త లైటింగ్ ఎలిమెంట్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్, రీ-డిజైన్ చేయబడిన గ్రిల్, కొత్త స్కిడ్ ప్లేట్లు దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. కారు వెనుక భాగంలో కొత్త టెయిల్ లాంప్స్, అప్‌డేటెడ్ బంపర్ ఉన్నాయి. ఈ కారు ఇప్పుడు సైంటిఫిక్ బ్లూ, కారామెల్ ఎల్లో, బెంగాల్ రూజ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ప్రీమియర్ ఇంటీరియర్, టెక్నాలజీ
కారు లోపల కేబిన్ ఇప్పుడు మరింత విలాసవంతంగా మార్చబడింది. టాటా లోగో వెలుగులీనేలా కొత్త ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. 26.03 సెంటీమీటర్ల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 7-అంగుళాల TFT స్క్రీన్ ఉన్నాయి. ఈ కారు స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ అనే 6 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
సీఎన్‌జీతో పాటు ఆటోమేటిక్ కూడా!
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద విశేషం ఏమిటంటే, దేశంలోనే సీఎన్‌జీ (CNG) ఆప్షన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్న మొదటి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇదే. ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ శక్తివంతమైన పనితీరును ఇస్తుంది. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. 1.2 లీటర్ సీఎన్‌జీ ఆప్షన్.. కేవలం 11.1 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగల సామర్థ్యం దీనికి ఉంది.
భద్రతలో 'పంచ్' అదిరింది!
టాటా మోటార్స్ తన వాహనాల భద్రతకు ఇచ్చే ప్రాముఖ్యతను మరోసారి నిరూపించుకుంది. ఈ కారుకు ప్రతిష్టాత్మకమైన భారత్ NCAP 5-స్టార్ రేటింగ్ లభించింది. ఒక ట్రక్కుతో 50 కి.మీ వేగంతో ఢీకొట్టించి చేసిన లైవ్ టెస్టులో కూడా కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (iTPMS), రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications