టాటా సియెర్రా Vs హ్యుందాయ్ క్రెటా.. ఏ ఎస్‌యూవీ బెస్ట్?

Tata Sierra vs Hyundai Creta: టాటా మోటార్స్ తమ కొత్త సియెర్రా ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటాతో ఈ కొత్త కారు ప్రధానంగా పోటీ పడనుంది. టాటా సియెర్రా రాకతో క్రెటాకు సరైన పోటీ వస్తోందని ఉత్సుకత ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎస్‌యూవీల ప్రారంభ ధరలు, కొలతలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ధరల పోలిక: మొదటగా ఈ రెండు ఎస్‌యూవీల ధరలను గమనిస్తే.. టాటా సియెర్రా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలుగా ఉంది. అయితే ఇది ముందస్తుగా పరిచయ ధర మాత్రమే. రాబోయే రోజుల్లో దీని ధర పెరిగే అవకాశం ఉంది. మరోవైపు హ్యూందాయ్ క్రెటా ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ.10.73 లక్షల నుంచి ప్రారంభమై రూ.20.20 లక్షల వరకు ఉంది. సియెర్రా బేస్ మోడల్ ధర క్రెటా బేస్ మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సియోర్రా కొలతలు, ఫీచర్ల పరంగా క్రెటా కంటే మెరుగ్గా కనిపిస్తోంది.

Tata Sierra vs Hyundai Creta Which SUV is Best in 2025

కొలతలు:
సియెర్రాదే పైచేయి: డైమెన్షన్స్ పరంగా టాటా సియెర్రా స్పష్టంగా క్రెటా కంటే పెద్దది. కొత్తగా విడుదలైన సియెర్రా పొడవు 4340 మి.మీ, వెడల్పు 1841 మి.మీ, ఎత్తు 1715 మి.మీగా ఉంది. దీని వీల్‌బేస్ 2730 మి.మీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీ ఉంది. సియెర్రా 622 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న క్రెటా కొలతలను చూస్తే దాని పొడవు 4330 మి.మీ, వెడల్పు 1790 మి.మీ, ఎత్తు 1635 మి.మీగా ఉన్నాయి. క్రెటా వీల్‌బేస్ 2610 మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 190 మి.మీ, బూట్ స్పేస్ 433 లీటర్లు. అంటే కొలతల పరంగా సియెర్రా ప్రతి అంశంలోనూ క్రెటా కంటే పెద్దదిగా ఉండి ఎక్కువ క్యాబిన్ స్థలాన్ని అందిస్తోంది.

ఫీచర్లు:
సియెర్రాలో ట్రిపుల్ స్క్రీన్స్: టాటా మోటార్స్ తమ సరికొత్త సియెర్రాను ఫీచర్-ప్యాక్డ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లలో లేని అనేక ప్రత్యేకతలు సియెర్రాలో ఉన్నాయి. ఇందులో ఏకంగా మూడు స్క్రీన్లు ఉన్నాయి - అవి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ప్యాసింజర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ఒక స్క్రీన్ ఉంది. అదనంగా ప్రీమియం ఇంటీరియర్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అండర్ థై సపోర్ట్, డాల్బీ అట్మోస్‌తో కూడిన ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు సియెర్రాలో ఉన్నాయి.

క్రెటా కూడా తక్కువేం కాదు: హ్యుందాయ్ క్రెటా కూడా ఫీచర్ల విషయంలో చాలా శక్తివంతమైనది. దీని బలమైన డిజైన్, స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్, పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్ ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి. క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. భద్రత (సేఫ్టీ) పరంగా.. క్రెటాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌తో పాటు అనేక ముఖ్యమైన ADAS ఫీచర్లు లభిస్తాయి.

కొలతలు, క్యాబిన్ స్థలం, ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ల పరంగా టాటా సియెర్రా మెరుగైనదిగా నిలుస్తోంది. అయితే హ్యుందాయ్ క్రెటా నిరూపితమైన మార్కెట్ ట్రాక్ రికార్డ్, ఆకర్షణీయమైన డిజైన్, ADAS వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్ల కారణంగా బలమైన పోటీని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+