Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.6.5 లక్షల కోట్ల సునామీ: మార్కెట్‌ను కమ్మేయనున్న పెళ్లిళ్ల ధమాకా! రేపటి నుంచే షురూ!

Wedding Season: ఇండియా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించే పెళ్లిళ్ల సీజన్ రేపటి(నవంబర్ 1) నుంచి ప్రారంభం కానుంది. రేపు దేవోత్థాన ఏకాదశి కావడంతో శుభ ముహూర్తాల సందడి మొదలవుతుంది. ఈ సీజన్‌లో సుమారు 46 లక్షల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని అంచనా. ఈ భారీ సంఖ్యలో జరిగే వివాహాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.6.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా.

రేపటి నుంచి భారీగా పెళ్లి సందడి
చిన్న వ్యాపారుల సంఘం కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) పరిశోధనా విభాగం (CRTDS) చేసిన అధ్యయనం ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు శుభ ముహూర్తాలు ఉన్న ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 46 లక్షల వివాహాలు జరుగుతాయి.ఈ వివాహాల ద్వారా మార్కెట్‌కు సుమారు రూ.6.50 లక్షల కోట్ల అపారమైన వ్యాపార బలం లభిస్తుంది. ఒక్క ఢిల్లీలోనే ఈ సీజన్‌లో 4.8 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, దీని ద్వారా రూ.1.8 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని CAIT పేర్కొంది.

The Wedding Season Boom Rs 6 5 Lakh Crore Market Surge Begins Tomorrow

వివాహ ఆర్థిక వ్యవస్థ - దేశానికి బలం
క్యాట్ (CAIT) ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. 2025 అక్టోబర్ 15 నుంచి 25 మధ్య దేశంలోని 75 ప్రధాన నగరాల్లో ఈ సర్వే జరిగింది. భారతదేశ 'వెడ్డింగ్ ఎకానమీ' (Wedding Economy) దేశీయ వ్యాపారంలో ఒక పటిష్టమైన స్తంభంగా ఉందని ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు. ఇది సంప్రదాయం, ఆధునికత,స్వావలంబన (ఆత్మనిర్భరత) కలయిక అని ఆయన అన్నారు. ఇది మార్కెట్‌ను బలోపేతం చేయడమే కాక, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలను అందిస్తుందన్నారు.

పెరిగిన ఖర్చు, పెరిగిన ధరలు
ఈ సంవత్సరం పెళ్లిళ్ల సంఖ్య దాదాపు గతేడాది మాదిరిగానే ఉన్నప్పటికీ, ప్రతి పెళ్లికి అయ్యే ఖర్చు గణనీయంగా పెరిగిందని ఖండేల్‌వాల్ తెలిపారు.
బంగారం-వెండి ధరలు, వస్త్రాలు, వేడుకల ఖర్చులు, మ్యారేజ్ హాల్ అద్దెలు పెరగడం వల్ల సగటు వివాహ ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెరిగింది.

ఏ రంగంలో ఎంత ఖర్చు?
రూ.6.5 లక్షల కోట్ల మొత్తం అంచనా వ్యయంలో వివిధ రంగాలు పాలు పంచుకుంటున్నాయి:
*వస్త్రాలు & చీరలు -10 శాతం
*ఆభరణాలు-15శాతం
*ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్స్-5%
*ఈవెంట్ మేనేజ్‌మెంట్-5%
*కేటరింగ్-10%
*పూల అలంకరణ-4%
*ఫొటోగ్రఫీ & వీడియోగ్రఫీ-2%
*ఇతర సేవలు (సంగీత బృందాలు, లైటింగ్, ప్రయాణం)-13%
*కిరాణా, పండ్లు, మిఠాయిలు-10%
*గిఫ్ట్ ఐటమ్స్, ఇతరాలు-10%

ప్రాంతాలవారీగా ట్రెండ్స్
ఢిల్లీ: ఇక్కడ అత్యధికంగా ఆభరణాలు, ఫ్యాషన్, వేదికలపై ఖర్చు చేస్తున్నారు.

రాజస్థాన్, గుజరాత్: ఇక్కడ లగ్జరీ, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరుగుతోంది.

యూపీ, పంజాబ్: ఈ రాష్ట్రాల్లో సాంప్రదాయ అలంకరణ, కేటరింగ్‌పై భారీ వ్యయం జరుగుతోంది.

దక్షిణ రాష్ట్రాలు: హెరిటేజ్, ఆలయ వివాహాల కారణంగా పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తోంది. ఈ వివాహాల సీజన్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత బలాన్ని ఇస్తుందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+